Begin typing your search above and press return to search.

కమింగ్‌ సూన్‌ః 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'

By:  Tupaki Desk   |   31 May 2016 11:00 AM GMT
కమింగ్‌ సూన్‌ః ఎక్కడికి పోతావు చిన్నవాడా
X
కొన్ని సినిమాలు టైటిల్స్ తోనే యమా క్రేజ్ సంపాదించేసుకుంటాయి. ముఖ్యంగా పాత సినిమాల్లోని పాటల పల్లవులను సినిమా టైటిల్స్ గా వాడుకునే కల్చర్ మనదగ్గర బాగానే కంటిన్యూ అవుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన నాగార్జున మూవీ సోగ్గాడే చిన్ని నాయనకు.. టైటిల్ తోనే సూపర్బ్ క్రేజ్ వచ్చింది. ఇప్పుడు దాదాపు ఆ రేంజ్ టైటిల్ నే పట్టుకొచ్చాడు యంగ్ హీరో నిఖిల్.

హేభా పటేల్ హీరోయిన్ గా.. టైగర్ ఫేమ్ విఐ ఆనంద్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు నిఖిల్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ లుక్ రిలీజ్ అందరినీ ఆకట్టుకుంది. ఆడియన్స్ ను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు అర్ధమవుతోంది. జూన్ 1న ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని ఇప్పటికే ఎనౌన్స్ చేయగా.. ఇప్పుడా చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఫస్ట్ లుక్ తో పాటే టైటిల్ ని అనౌన్స్ చేయాలనే ఉద్దేశ్యంతోనే.. ఇప్పటివరకూ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదని తెలుస్తోంది.

'ఎక్కడికి పోతావు చిన్నవాడా'.. ఇదే నిఖిల్ నెక్ట్స్ పిక్చర్ టైటిల్. జగ్గయ్య - బి సరోజ జంటగా నటించిన ఆత్మబలం చిత్రంలోని పాటకు పల్లవి ఇది. ఈ సాంగ్ ఇప్పటికీ జనాలకు నచ్చుతుంది. అలనాటి ప్రేక్షకులు అయితే.. మర్చిపోలేని పాట ఇది. అందుకే తన సినిమాకి ఈ మాంచి క్యాచీ టైటిల్ ని తెచ్చాడు నిఖిల్. టైటిల్ తోనే ఇంత క్యూరియాసిటీ క్రియేట్ చేయగా.. టైటిల్ ని, ఫస్ట్ లుక్ ని రేపు ఉదయం రివీల్ చేయనున్నారు.