Begin typing your search above and press return to search.

ట్యాలెంటెడ్ హీరో.. అస‌లేం జ‌రుగుతోంది?

By:  Tupaki Desk   |   25 Jun 2019 1:30 AM GMT
ట్యాలెంటెడ్ హీరో.. అస‌లేం జ‌రుగుతోంది?
X
ట్యాలెంటెడ్ హీరో నిఖిల్ రేసులో వెన‌క‌డుగు వేసాడా? అస‌లేం జ‌రుగుతోంది? నిఖిల్ న‌టించిన సినిమా రిలీజై ఇప్ప‌టికే చాలా కాల‌మైంది. దీంతో అభిమానుల్లో ఒక‌టే ఉత్కంఠ నెల‌కొంది. వెప‌న్ లా దూసుకొచ్చే స‌త్తా ఉన్నా ఎందుకీ ఆల‌స్యం అంటూ ఫ్యాన్స్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అత‌డు న‌టించిన అర్జున్ సుర‌వ‌రం ఈపాటికే రిలీజ్ కావాల్సింది. అయితే ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఈ సినిమాని వాయిదా వేశారు. జూన్ లేదా జూలైలో రిలీజ‌వుతుంద‌ని ఇటీవ‌ల వార్త‌లొచ్చాయి. కానీ ఇప్ప‌టికీ టీమ్ స‌రైన స్ప‌ష్ట‌త‌ను ఇవ్వ‌డం లేదు. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు? అన్న‌దానిపై క్లారిటీ కోసం నిఖిల్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.

మ‌రోవైపు నిఖిల్ న‌టించే సినిమా `శ్వాస` స‌న్నివేశ‌మేంటి? అని ఆరాతీస్తే దానిపైనా పూర్తి క్లారిటీగా చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ చిత్రానికి కిష‌న్ క‌ట్టా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. అయితే హీరో ద‌ర్శ‌కుడి మ‌ధ్య క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ త‌లెత్తాయ‌ని.. క‌థ‌లో మార్పు చేర్పుల కోసం ప్ర‌య‌త్నిస్తున్నార‌ని మ‌రోవైపు ప్ర‌చారం సాగుతోంది. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదింకా. దీంతో నిఖిల్ ఫ్యాన్స్ లో ఎగ్జ‌యిట్ మెంట్ అంత‌కంత‌కు పెరుగుతోందే కానీ త‌గ్గ‌డం లేదు.

తొలిగా `అర్జున్ సుర‌వ‌రం `ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? అన్నదానిపై వెంట‌నే స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. సేమ్ టైమ్ శ్వాస‌కు సంబంధించిన క్లారిటీనిస్తారా? అన్న‌ది తేలాలి. మ‌రోవైపు చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయ సీక్వెల్ ని ప్ర‌క‌టించారు. ఆ సినిమా రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌కు సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది. ప్ర‌తిసారీ ఏదో ఒక కొత్త‌ద‌నంతో రావ‌డం నిఖిల్ స్టైల్. టాలీవుడ్ లో ఉన్న అర‌డ‌జ‌ను యంగ్ డైన‌మిక్ హీరోల్లో నిఖిల్ ఎంతో యూనిక్ స్టైల్ ఉన్న హీరోగా ఎదిగాడు. అందుకే అత‌డి సినిమాలు రిలీజ్ ల‌కు రాక‌పోతే ఫ్యాన్స్ లో మాత్రం ఆత్రం పెరుగుతూనే ఉంటుంది. ఈ స‌న్నివేశంలో అత‌డు పూర్తి క్లారిటీ ఇస్తాడేమో చూడాలి. అర్జున్ సుర‌వ‌రం.. శ్వాస‌.. కార్తికేయ 2 .. ఈ మూడింటిపైనా క్లారిటీ కావాల్సి ఉంది.