Begin typing your search above and press return to search.

డాక్ట‌ర్ తో యంగ్ హీరో ప్రేమాయణం

By:  Tupaki Desk   |   13 Oct 2019 2:30 PM GMT
డాక్ట‌ర్ తో యంగ్ హీరో ప్రేమాయణం
X
ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా` విజ‌యాన్ని యంగ్ హీరో నిఖిల్ ఏ మాత్రం క్యాష్ చేసుకోలేక‌పోయాడు. తాజాగా త‌ను న‌టించిన `అర్జున్ సుర‌వ‌రం` రిలీజ్ చిక్కుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోంది. ఇదివ‌ర‌కూ ప‌ట్టాలెక్కిన `శ్వాస‌` అర్థాంత‌రంగా ఆగిపోయింది. ఆ క్ర‌మంలోనే ఆ రెండిటితోనే చాలా స‌మ‌యం వృధా అయ్యింది. ప్ర‌స్తుతం చందు మొండేటితో క‌లిసి `కార్తికేయ‌-2` కోసం సిద్ధ‌మ‌వుతున్నాడు. ఇదిలా వుంటే త‌ను ఓ యంగ్ డాక్ట‌ర్ తో ప్రేమ‌లో వున్నాన‌ని వెల్ల‌డించి షాకిచ్చాడు. `ఫీట‌ప్ విత్ స్టార్స్` పేరుతో మంచు ల‌క్ష్మి ఓ రియాల్టీ షో చేస్తోంది. ఇందులో పాల్గొన్న నిఖిల్ ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టాడు. త‌ను ఓ డాక్ట‌ర్‌ తో ప్రేమ‌లో వున్నాన‌ని వెల్ల‌డించి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

`ఆమె ఓ డాక్ట‌ర్‌. నా జీవితంలో ఆ అమ్మాయి చాలా స్పెష‌ల్‌. త‌ను న‌న్ను బాగా అర్థం చేసుకుంది. నేను షూటింగ్ లో వున్న‌ప్పుడు కానీ.. ఫ్రెండ్స్‌తో వున్న‌ప్పుడు కానీ త‌ను న‌న్ను అస్స‌లు డిస్ట్ర‌బ్ చేయ‌దు. త‌ను నా ఫోన్ కూడా చెక్ చేయ‌దు. `నువ్వు ఎప్పుడు స‌ర‌దాగా గ‌డ‌పాల‌ని అనుకుంటే అప్పుడు గ‌డుపు` అని నాతో అంటుంది. ప్ర‌తీ ఒక్క‌రికి వ్య‌క్తిగ‌త జీవితం వుంటుంద‌ని త‌ను న‌మ్ముతుంది. త‌న‌లో అదే నాకు బాగా న‌చ్చింది`` అని త‌న డ్రీమ్ గాళ్ గురించి నిఖిల్ వెల్ల‌డించాడు.

చిన్న‌త‌నం నుంచి షారుఖ్ ఖాన్ సినిమాలు చూస్తూ పెర‌గ‌డం వ‌ల్ల అప్ప‌టి నుంచే ప్రేమ పెళ్లంటే ఇష్టం పెరిగింది అని నిఖిల్ అస‌లు సీక్రెట్ బ‌య‌ట‌పెట్టాడు. మొత్తానికి యంగ్ హీరో ఒక డాక్ట‌ర్ ని సెలెక్ట్ చేసుకున్నాడ‌ని క్లారిటీగా అర్థ‌మ‌వుతోంది. యాక్ట‌ర్ డాక్ట‌ర్ ని పెళ్లాడే కాన్సెప్ట్ బాగానే ఉంది. ఇంత‌కీ ఆ డాక్ట‌ర్ పేరేమిటో కుటుంబ వివ‌రాలేమిటో మాత్రం చెప్ప‌లేదు.