Begin typing your search above and press return to search.

నిఖిల్‌ టెక్నిక్‌ హై స్టాండార్డ్‌

By:  Tupaki Desk   |   1 Aug 2015 11:54 AM GMT
నిఖిల్‌ టెక్నిక్‌ హై స్టాండార్డ్‌
X
ఇంతకాలం మనం చూసిన నిఖిల్‌ వేరు. ఇక నుంచి మనం చూడబోతున్న నిఖిల్‌ వేరు. ఆ సంగతిని లేటెస్టుగా అతడు నటిస్తున్న శంకరాభరణం సినిమా నిరూపించబోతోంది. టాలీవుడ్‌ లో ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఈ కుర్రహీరో తన మార్కెట్‌ రేంజు పెంచుకుంటూ పోతున్నాడు. స్వామిరారా చిత్రంతో మొదలైన ప్రభంజనం ఆ తర్వాత కార్తికేయ, సూర్య వర్సెస్‌ సూర్య చిత్రాలతోనూ కొనసాగించాడు. సక్సెస్‌ అతడిని మెట్టు మెట్టు పైకెక్కిస్తోంది.

సరిగ్గా ఇదే ఊపులో అనూహ్యంగా విదేశాలు వెళ్లిన నిఖిల్‌ సరికొత్త అవతారంతో ఇండియాలో దిగాడు. హెయిర్‌ స్టయిల్‌ సహా లుక్‌ పూర్తిగా మారిపోయింది. లేటెస్టు గా కోన వెంకట్‌ నిర్మాతగా తెరకెక్కుతున్న శంకరాభరణం చిత్రంలో పూర్తి న్యూలుక్‌ తో కనిపిస్తున్నాడు. పైగా ఈ సినిమా టెక్నికల్‌ గా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కుతోంది.

నిఖిల్‌పై ఓ బాడీ రిగ్‌ కెమెరాని ఉపయోగించి కొన్ని అద్భుతమైన షాట్స్‌ ని తెరకెక్కించారు. ఈ విజువల్స్‌ ప్రత్యేకమైన ఎఫెక్ట్‌ ని కలిగి ఉంటాయి. థియేటర్‌ లో ఆడియెన్‌ ని మెస్మరైజ్‌ చేసే షాట్‌ చూడొచ్చని నిఖిల్‌ స్వయంగా చెబుతున్నాడు. ట్విట్టర్‌ లో శంకరాభరణం అప్‌ డేట్స్‌ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నాడు నిఖిల్‌.