Begin typing your search above and press return to search.

నిఖిల్ ఖాతాలో రెండు రీమేకులు

By:  Tupaki Desk   |   18 May 2017 6:40 AM GMT
నిఖిల్ ఖాతాలో రెండు రీమేకులు
X
‘స్వామిరారా తో బ్రేక్ అందుకున్నాక యువ కథానాయకుడు నిఖిల్ కెరీరే మారిపోయింది. అక్కడి నుంచి జాగ్రత్తగా సినిమాల్ని ఎంచుకుంటూ కెరీర్ ను సరైన రూట్లో నడిపిస్తున్నాడు నిఖిల్. ‘స్వామి రారా’ తర్వాత వచ్చిన నిఖిల్ సినిమాల్లో ఒక్క ‘శంకరాభరణం’ మాత్రమే తేడా కొట్టింది. ఆ సినిమా బాలీవుడ్ హిట్ మూవీ ‘ఫస్ గయారే ఒబామా’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చేదు అనుభవం మిగిల్చాక మళ్లీ డైరెక్ట్ తెలుగు సినిమాలే చేస్తూ వస్తున్నాడు నిఖిల్. ఐతే ఈ మధ్య నిఖిల్ కు మళ్లీ రీమేక్ సినిమాలపై మనసు మళ్లుతున్నట్లుంది. అతను ఒకటికి రెండు రీమేక్ లు లైన్లో పెట్టడం విశేషం.

కన్నడలో హిట్టయిన ‘కిరిక్ పార్టీ’ రీమేక్ ను నిఖిల్ ఇప్పటికే కన్ఫమ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని 14 రీల్స్ వాళ్లు నిర్మించబోతున్నారు. రాజు సుందరం డైరెక్ట్ చేస్తాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తోంది. దీంతో పాటు మరో తమిళ రీమేక్ కు కూడా నిఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. అదే.. కణిదన్. ఈ రీమేక్ గురించి రెండేళ్లుగా టాలీవుడ్లో డిస్కషన్లు నడుస్తున్నాయి. రవితేజ హీరోగా ఈ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించాలని దీని ఒరిజినల్ డైరెక్టర్ టీఎన్ సంతోష్ ఆశపడ్డాడు. కానీ మాస్ రాజా ఓకే చెప్పలేదు. తర్వాత ఒకరిద్దరు హీరోల దగ్గరికెళ్లింది రీమేక్ ప్రపోజల్. వాళ్లూ ఆసక్తి చూపించలేదు. ఐతే నిఖిల్ మాత్రం ఈ కథలో దమ్ముందని.. తనకు సూటవుతుందని నమ్మి రీమేక్ కు ఓకే చెప్పాడు. సర్టిఫికెట్ల కుంభకోణం మీద పోరాడి పెద్ద రౌడీ గ్యాంగు ఆట కట్టించే కుర్రాడి కథతో ‘కణిదన్’ తెరకెక్కింది. అధర్వ హీరోగా నటించాడు. తమిళంలో ఈ చిత్రాన్ని నిర్మించిన కలైపులి థానునే తెలుగులోనూ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తారని సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/