Begin typing your search above and press return to search.

బీచ్‌ లో శంకరాభరణమేంది భయ్యా?

By:  Tupaki Desk   |   28 Aug 2015 5:43 PM GMT
బీచ్‌ లో శంకరాభరణమేంది భయ్యా?
X
హీరో నిఖిల్‌ కెరీర్‌ పీక్స్‌ లో ఉందిప్పుడు. వరుసగా హ్యాట్రిక్‌ విజయాలు అందుకుని తనని తాను పదును పెట్టుకున్నాడు. స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్‌ సూర్య నిఖిల్‌ ఇమేజ్‌ ని రెట్టింపు చేశాయి. ఏ బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా ఎదుగుతున్న హీరోగా పేరు తెచ్చుకుంటున్నాడు. వైవిధ్యమైన కథల్ని, సత్తా ఉన్న దర్శకుల్ని ఎంచుకుని నిఖిల్‌ ఎదుగుతున్న తీరు నవతరం హీరోలకు ఆదర్శంగా మారింది.

ఇప్పుడు అతడు స్టార్‌ రైటర్‌ కోన వెంకట్‌ తో కలిసి పనిచేస్తున్నాడు. ఈ గ్యాంగ్‌ 'శంకరాభరణం' అనే క్రైమ్‌ కామెడీని ప్లాన్‌ చేశారు. రైటర్‌ కోన స్వయంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాడు. ఎంవివి సత్యనారాయణ నిర్మిస్తున్నారు. దారి దోపిడీలు చేసే భీహార్‌ గ్యాంగ్‌ ఆగడాలు ఎలా ఉంటాయన్నది తెరపై చూపిస్తున్నారు. ఇదిగో ఈ శనివారం నాగార్జున పుట్టినరోజు సందర్భంగా నిఖిల్‌ టీమ్‌ కింగ్‌ కి శుభాకాంక్షలు చెబుతూ ఈ పోస్టర్‌ ని వేశారు.

నిఖిల్‌ భయ్యా బీచ్‌లో బ్యూటీస్‌ తో ఓ రేంజులో సాంగేసుకుంటున్నాడు. పోస్టర్‌ చూస్తుంటేనే కిక్కిస్తోంది. డబ్బు దోపిడీ ఒక్కటే కాదు మనసు దోపిడీ కూడా చేసేట్టున్నాడే? రేతిరంతా జాగరమే, శంకరాభరణమే!