కాలేజ్ స్టూడెంట్ గా నటిస్తున్న నిఖిల్

Sat Jul 15 2017 12:55:50 GMT+0530 (IST)

వినూత్నమైన కథలు ఎంచుకుంటూ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నిఖిల్. ఎక్కడికిపోతావు చిన్నవాడా కేశవ వండి సూపర్ హిట్స్ తరువాత నిఖిల్ నెక్ట్స్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నిఖిల్ మరోసారి తనదైన శైలిలో తన తదుపరి చిత్రం కోసం ఓ వినూత్నమైన కథను ఎంచుకున్నట్లు తెలిసింది.

కాలెజ్ నేపథ్యంలో సాగే సినిమాలో నటించేందుకు నిఖిల్ తాజాగా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇది వరకే ఈ సినిమాకి సంబంధించిన వార్తలు బయటకు వచ్చినప్పటికి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటణ రాలేదు. అయితే త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ ఎన్సౌన్స్ మెంట్ రాబోతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే మొదటి నుంచి ఈ సినిమాని కొరియోగ్రాఫర్ రాజుసుందరం డైరెక్ట్ చేస్తాడనే ప్రచారం సాగింది.

అయితే తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ మధ్య వినిపిస్తున్న టాక్ ని బట్టి చూస్తే ఈసారి ఓ కొత్త దర్శకుడికి నిఖిల్ ఛాన్స్ ఇచ్చినట్లుగా తెలిసింది. తన సన్నిహితులు - దర్శకులు చందుమొండేటి - సుధీర్ వర్మల దగ్గర వర్క్ చేసిన ఓ సహాయ దర్శకుడిని ఈ సినిమాతో దర్శకుడిని చేసే ప్రయత్నాల్లో నిఖిల్ ఉన్నాడట. గతంలో కూడా చాలా మంది కొత్త దర్శకులకి అవకాశాలు ఇస్తూ తన కెరీర్ గ్రాఫ్ ని కూడా  పెంచుకుంటూ వెళ్తున్న నిఖిల్ మరోసారి కాలెజ్ స్టూడెంట్ గా ఎలా మెప్పిస్తాడో వేచి చూద్దాం.