హైదరాబాద్ అమ్మాయితో నిఖిల్ పెళ్ళి ఫిక్స్

Mon Aug 07 2017 17:11:44 GMT+0530 (IST)

చాన్నాళ్ళ నుండి హీరో నిఖిల్ కు పెళ్ళిచేయాలని వాళ్లింట్లో సంబంధాలు చూస్తున్నారు. ఇదే విషయం గురించి నిఖిల్ మాట్లాడుతూ.. తనకు సంబంధాలు చూస్తున్నారని.. ఇంట్లో ఎవరిని చూస్తే వారినే పెళ్ళిచేసుకుంటానని.. ఫిలిం ఇండస్ర్టీలో ఎవరితోనూ లవ్ ట్రాక్స్ గట్రా లేవంటూ క్లారిటీ కూడా ఇచ్చాడు. తీరా చూస్తుంటే ఇప్పుడు నిఖిల్ కు ఒక ఏరేంజెడ్ మ్యారేజ్ మ్యాచ్ సెట్టయినట్లు ఉంది.

హైదారాబాద్ కు చెందిన ఆంజనేయులు అనే బిజినెస్ మ్యాన్ కూతురు తేజస్వినితో నిఖిల్ పెళ్ళి ఫిక్సయ్యిందని తెలుస్తోంది. ఈ మధ్యనే ఇంజీనిరంగ్ పూర్తి చేసిన తేజస్విని నిఖిల్ కు దగ్గర బంధువే. వీరిద్దరికీ ఈ నెల 24న హైదారబాదులో ఒక ఐదు నక్షత్రాల హోటల్లో ఎంగేజ్మెంట్ జరుగుతోందట. అలాగే అక్టోబర్ 1న భారీగా పెళ్లి చేయాలని నిర్ణయించారట. లోకల్ వెడ్డింగా లేదంటే డెస్టినేషన్ వెడ్డింగా అనేది ఇంకా తెలియదు. ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహమేనని తెలుస్తోంది. ఈ నెల 20 నుండి ఎంగేజ్మెంట్ ఆహ్వాన పత్రికలను నిఖిల్ ఇండస్ర్టీలో పంచుతాడని టాక్ వస్తోంది. అయితే ఈ అమ్మాయికి సంబంధించిన విషయాలన్నీ కాస్త సీక్రెట్ గా ఉండేలా చూసుకుంటున్నాడు నిఖిల్. ఎందుకంటే ఏ మాత్రం హింటిచ్చినా కూడా మన మీడియా చేసే రచ్చ గురించి తెలుసుగా.

ప్రస్తుతం కన్నడ సినిమా కిరాక్ పార్టీ రీమేక్ లో నటిస్తున్న ఆ సినిమా షూటింగ్ పూర్తి పూర్తవ్వగానే పెళ్ళి చేసుకుంటాడట. ప్రస్తుతం ఎంగేజ్మెంట్ చేసుకుని మరో రెండు మూడు నెలల్లో పెళ్ళి అనమాట. చూస్తుంటే అక్టోబర్ లో నాగచైతన్య అండ్ సమంత పెళ్ళి తరువాత.. ఈ కుర్ర హీరో పెళ్ళి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యేలా ఉందే.