Begin typing your search above and press return to search.

నిఖిల్.. గెట‌ప్ మార‌లేదేంటి గురూ!

By:  Tupaki Desk   |   20 July 2018 9:24 AM GMT
నిఖిల్.. గెట‌ప్ మార‌లేదేంటి గురూ!
X
ఒకొక్క సినిమాలో ఒక్కోలా క‌నిపిస్తుంటారు హీరోలు. అలా క‌నిపిస్తేనే కొత్త సినిమా చేసిన‌ట్టుగా ఫీల‌య్యేవాళ్లు చాలామందే. ఒక సినిమాలో హెయిర్ క‌ట్ కొత్త‌గా ఉండేలా చూసుకొంటే.. మ‌రొక సినిమా కోసం కండ‌లు పెంచి ప్ర‌ద‌ర్శించే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. స్టైలింగ్‌ లోనో లేదంటే మేన‌రిజ‌మ్‌ లోనో ఇలా ఏదో ర‌కంగా కొత్త‌దనాన్ని చూపించాల‌ని త‌పిస్తుంటారు హీరోలు. అల్లు అర్జున్‌ లాంటి హీరో అయితే ఆ విష‌యంలో మ‌రింత శ్ర‌ద్ధ చూపిస్తుంటారు. నిజానికి అది మంచి ప్ర‌య‌త్నం కూడా. ఎప్పుడూ ఒకేలా క‌నిపిస్తే అది చూసేవాళ్ల‌కు కూడా బోర్‌ గానే ఉంటుంది. యువ క‌థానాయ‌కులు ఆ విష‌యంలో కాస్త జాగ్ర‌త్త‌గానే ఉంటారు.

అయితే నిఖిల్ మాత్రం సేమ్ గెట‌ప్‌ ని రిపీట్ చేస్తున్న‌ట్టున్నాడు. ఆయ‌న `కేశ‌వ‌`లో ఎలా క‌నిపించాడో - రాబోయే `ముద్ర` పోస్ట‌ర్ల‌లో కూడా అలాగే క‌నిపిస్తున్నాడు. ఆ విష‌యంలో కాస్త జాగ్ర‌త్త తీసుకోవ‌ల్సింద‌నే మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది. సాధార‌ణంగా అయితే నిఖిల్ కూడా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌గా క‌నిపించే ప్ర‌య‌త్నం చేస్తుంటాడు. ఇదివ‌ర‌కు ఆయ‌న సినిమాల్ని గ‌మ‌నిస్తే ఆ విష‌యం అర్థ‌మ‌వుతుంది. అలాంటి నిఖిల్ మ‌రి ఈసారి ఎందుకు సేమ్ గెట‌ప్ ఎంచుకొన్నాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ముద్ర త‌మిళ్ సినిమాకి రీమేక్‌ గా తెర‌కెక్కుతోంది. అందులోని గెట‌ప్పే కంటిన్యూ చేయాల‌నుకొన్నాడా? అందుకే అలా వ‌దిలేశాడా అనేది తెలియాల్సి వుంది. ఇందులో ఆయ‌న ఒక జ‌ర్నలిస్టుగా క‌నిపించ‌బోతున్నాడు. న‌కిలీ స‌ర్టిఫికెట్ల నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది.