Begin typing your search above and press return to search.

నిఖిల్ పార్టీ సమ్మర్ లోనే..

By:  Tupaki Desk   |   20 Feb 2018 6:54 AM GMT
నిఖిల్ పార్టీ సమ్మర్ లోనే..
X
కొంత మంది చిన్న హీరోల ప్రాబ్లమ్ ఏమిటో గాని ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా సినిమా రిలీజ్ విషయంలో కొన్ని ఇబ్బందులను చూడక తప్పడం లేదు. ఇతర సినిమాల వల్లనో లేక థియేటర్స్ సమస్యల వల్లనో తెలియదు గాని మొత్తానికి సినిమా మాత్రం రిలీజ్ కావడం లేదు. ఇక అసలు విషయంలోకి వస్తే గత కొంత కాలంగా నిఖిల్ సినిమా రిలీజ్ డేట్ పై కూడా చాలా అనుమానాలు వస్తున్నాయి.

నిఖిల్ కన్నడ సినిమా కిరిక్ పార్టీ అనే కథను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. శరన్ కొప్పిశెట్టి ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఈ నెల ఫిబ్రవరి 9నాడే రిలీజ్ కావలి. కానీ ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల కొంచెం ఆలస్యం కావడంతో రిలీజ్ డేట్స్ ని వాయిదా వేశారు. విడుదల తేదీని మారిస్తే ఈ వరం కాకుంటే నెక్స్ట్ వారం రిలీజ్ అవుతుందని అందరు అనుకుంటారు.

అయితే నిఖిల్ తన సినిమాను ఇప్పుడు రిలీజ్ చేయడం లేదట. ఏకంగా వచ్చే నెలకి తేదీని మార్చేశాడు. మార్చ్ 22 అయితే బెటర్ అని చిత్ర నిర్మాతలు రీసెంట్ గా నిర్యాయించుకున్నారు. దాదాపు షూటింగ్ మొత్తం మరో 10 రోజుల్లో ఫినిష్ అవుతుంది. అయితే ఇప్పుడు హడావుడిగా విడుదల చేయడం కన్నా సమ్మర్ లో రిలీజ్ చేసుకుంటే బెస్ట్ అని నిఖిల్ చెప్పినట్లు తెలుస్తోంది.