Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: చల్లగా పగ తీర్చుకునే కేశవ

By:  Tupaki Desk   |   21 March 2017 4:02 PM GMT




యంగ్ హీరో నిఖిల్ నటించే సినిమా అంటేనే జనాల్లో ఆసక్తి క్రియేట్ అయిపోతోంది. ప్రతీ చిత్రంతోనూ విభిన్నమైన ప్రయోగాలు చేస్తూ.. తన స్థాయిని అంతకంతకూ పెంచుకుంటున్న నిఖిల్.. ఇప్పుడు కేశవ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు.

ఇప్పుడు కేశవ టీజర్ ను రిలీజ్ చేశారు యూనిట్. ఫస్ట్ లుక్.. పోస్టర్స్ తోనే విపరీతంగా ఆకట్టుకున్న కేశవ.. ఇప్పుడు టీజర్ తో మరింతగా కట్టి పడేస్తున్నాడు. టీజర్ ప్రారంభంలోనే "భూతాన్ని.. యజ్ఞోపవీతాన్ని.."అంటూ గ్రాంథికంగా నెరేషన్ మొదలుపెట్టిన నిఖిల్.. ఆ తర్వాత "స్మరిస్తే పద్యం.. అరిస్తే వాక్యం" అంటూ తన పాయింట్ ని నర్మగర్భంగా చెప్పాడు. ఈ మూవీలో పగ.. ప్రతీకారం థీమ్ తో ఉంటుందని ముందు చెప్పేయడం.. పగ అనే వంటకాన్ని చల్లగా ఉన్నపుడే వడ్డిస్తే.. దాని ప్రభావం ఎక్కువ అని క్యాప్షన్ రాయడం ఆసక్తి కలిగించాయి. టీజర్ లో కూడా అణువణువూ రక్త పాతం.. గొడ్డళ్లు.. పోలీస్ గా ఇషా కొప్పికర్ హంగామా కనిపిస్తుంది.

అయితే.. నిఖిల్ మాత్రం ఎక్కడా ఆవేశపడకుండా.. నిలకడగా తన కేరక్టర్ చేయడం విశేషం. నరికేముందు.. నరికిన తర్వాత కూడా కాసింత కూడా తన ఫీలింగ్స్ ను బయటపెట్టకుండా నిఖిల్ పోషించిన ఈ పాత్రే మూవీకి అసలైన హైలైట్. కాసింత ఆవేశపడినా మరణం కమ్ముకొచ్చేసే ప్రమాదంలో ఉన్న హీరోగా నిఖిల్ నటిస్తుండడంతో.. ఇంత స్టెబుల్ గా ఈ రోల్ చేశాడు నిఖిల్.