Begin typing your search above and press return to search.

నిఖిల్ ఏ సినిమాని వదలట్లేదుగా..

By:  Tupaki Desk   |   13 Jan 2018 2:30 AM GMT
నిఖిల్ ఏ సినిమాని వదలట్లేదుగా..
X
సినిమా హీరో అన్నాక అన్ని సినిమాలను చూడాలి. ఎవరు ఎలా చేస్తున్నారు ఎలాంటి కథలను ఎంచుకుటున్నారు అనేది అర్ధమవుతుంది. అప్పుడు వాటి రిజల్ట్ ని బట్టి ఏది చేయాలి ఏది చేయకూడదు అనే విషయంపై ఒక క్లారిటీ వస్తుంది. ప్రస్తుత జనరేషన్ కి ఆ ఆలోచన చాలా ఉపయోగపడుతుంది. ఇకపోతే ప్రస్తుతం మంచి హిట్స్ తో దూసుకుపోతపోతోన్న యువ హీరో నిఖిల్ బహుశా ఈ ఆలోచనాతోనే ఉన్నట్టున్నాడు. లేకపోతే అభిమానంతో సినిమాలను చూడటానికి వెలుగుతున్నాడో గాని అన్ని సినిమాలను వదలకుండా చూసేస్తున్నాడు.

నిఖిల్ ప్రస్తుతం యూఎస్ లో హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే మొన్న అజ్ఞాతవాసి రిలీజ్ అయితే ప్రీమియర్ షోని చూసేసిన ఈ హీరో రీసెంట్ గా బాలయ్య సినిమాను కూడా చూసేశాడు. ఈస్ట్ ఆర్ వెస్ట్ బాలయ్య బాబు ఈజ్ ద బెస్ట్ అంటూ ఓ ట్వీట్ కూడా చేశాడు. అందులో బాలయ్య ఫొటో కూడా ఉంది. మొత్తానికి నిఖిల్ తన ఎంజాయ్ మెంట్ లో తెలుగు సినిమాలను కూడా చూస్తూ అమెరికా మంచు వాతావరణాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇక ప్రస్తుతం నిఖిలో కిర్రాక్ పార్టీ అనే ఒక సినిమాలో చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ కూడా సగం అయిపొయింది. ఇక మిగతా షూటింగ్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి సమ్మర్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నాడు. కన్నడ కిరిక్ పార్టీకి ఆ సినిమా రీమేక్ గా వస్తోంది.