Begin typing your search above and press return to search.

ప్రి లుక్కే కాదు.. ఫ‌స్ట్ లుక్కూ అదిరింది

By:  Tupaki Desk   |   31 May 2016 1:31 PM GMT
ప్రి లుక్కే కాదు.. ఫ‌స్ట్ లుక్కూ అదిరింది
X
‘శంక‌రాభ‌ర‌ణం’ దెబ్బ‌కు బెంబేలెత్తిపోయిన నిఖిల్.. ఈసారి తిరిగి ఫామ్ అందుకునేలాగే క‌నిపిస్తున్నాడు. అత‌డి కొత్త సినిమాకు సంబంధించిన విశేషాలు అంత ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి మ‌రి. మూడు రోజుల ముందు రిలీజ్ చేసిన ప్రి లుక్ పోస్ట‌ర్ సినిమా మీద ఒక్క‌సారిగా క్యూరియాసిటీ క‌లిగించింది. ఇప్పుడిక ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కూడా అంతే ఆస‌క్తిక‌రంగా ఉంది. ఈ పోస్ట‌ర్లోనే సినిమా టైటిల్ కూడా ప్ర‌క‌టించేశారు. కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న టైటిలే క‌న్ఫ‌మ్ చేశారు. ‘ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా’.. అంటూ ఆత్మ‌బ‌లం సినిమాలోని పాట ప‌ల్ల‌వి స్ఫూర్తితో టైటిల్ పెట్టారీ సినిమాకు. ‘యు కెనాట్ ఎస్కేప్ ల‌వ్’ అన్న‌ది క్యాప్ష‌న్‌.

ఇక మొన్న ప్రి లుక్ లో చూపించిన లాంత‌రు ఈ ఫ‌స్ట్ పోస్ట‌ర్లో ప‌గిలిపోతూ ఉంది. అద‌లా ప‌గులుతుంటే నిఖిల్ ఆశ్చ‌ర్యంగా చూస్తున్నాడు. మొత్తంగా ఇదేదో సైన్స్ ఫిక్ష‌న్ మూవీలాగా క‌నిపిస్తోంది. తెలుగులో సైన్స్ ఫిక్ష‌న్లు చాలా చాలా అరుదు. ఒక‌వేళ తీసినా.. పెద్ద హీరోల‌తో భారీ బ‌డ్జెట్లో తీస్తారు. ఐతే త‌మిళంలో ‘అప్పూచి గ్రామం’ పేరుతో చాలా త‌క్కువ బ‌డ్జెట్లో సైన్స్ ఫిక్ష‌న్ మూవీ తీసి త‌న ప్ర‌తిభ చాటుకున్న వీఐ ఆనంద్‌.. తెలుగులోనూ అలాంటి ప్ర‌యోగ‌మే చేస్తున్న‌ట్లున్నాడు. టైగ‌ర్ త‌ర్వాత అత‌ను చేస్తున్న సినిమా ఇది. ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ హెబ్బా ప‌టేల్ తో పాటు త‌మిళమ్మాయి నందిత శ్వేత ఇందులో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.