Begin typing your search above and press return to search.

అర్జున్ సురవరం ఫిక్స్ అయ్యాడు

By:  Tupaki Desk   |   23 March 2019 5:04 AM GMT
అర్జున్ సురవరం ఫిక్స్ అయ్యాడు
X
యూత్ లో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ కలిగిన నిఖిల్ కొత్త సినిమా అర్జున్ సురవరం ఫైనల్ గా మే 1 రిలీజ్ డేట్ ని లాక్ చేసుకుంది. వాస్తవానికి ఈ నెల 29ని గతంలో ప్రకటించారు కానీ తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న ఎన్నికల వాతావరణానికి తోడు పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఇంకొంత సమయం అవసరం ఉండటంతో ఫైనల్ గా మేకు షిఫ్ట్ చేశారు. ఏప్రిల్ లో ఇంతకు ముందే షెడ్యూల్ చేసిన సినిమాలు వరసగా ఉండటంతో ఆ నెలను ఎంచుకునే అవకాశం లేకపోయింది.

దీంతో మే 1 ఫైనల్ అయ్యింది. నిఖిల్ లావణ్య త్రిపాఠి జంటగా నటించిన అర్జున్ సురవరం టీజర్ ఇప్పటికే భారీ స్పందన దక్కించుకుని ట్రెండింగ్ లో ఉంది. విడుదలైన ఆడియో సింగల్స్ కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు అర్జున్ సురవరం నైజామ్ హక్కులను ఏషియన్ సునీల్ నారంగ్ కు 4 కోట్ల రూపాయలకు డీల్ చేసుకున్నట్టు తెలిసింది. ఇది నిఖిల్ కెరీర్ లో హయ్యెస్ట్ అనే టాక్ ఉంది.

మిగిలిన ఏరియాలకు సైతం క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయని ఇంకా విడుదలకు టైం ఉంది కాబట్టి ఒక్కొక్కటి ఫైనల్ చేసే పనిలో ఉన్నారు నిర్మాత టాగోర్ మధు. తమిళ్ కనితన్ రీమేక్ ఒరిజినల్ దర్శకుడు సంతోష్ తో రూపొందుతున్నప్పటికీ తెలుగు నేటివిటీకి తగ్గట్టు కీలక మార్పులు జరిగాయని చెబుతున్నారు. సో ఇంకో నలభై రోజుల దాకా టైం ఉంది కాబట్టి అర్జున్ సురవరం ప్రమోషన్ ని చక్కగా ప్లాన్ చేసుకునే అవకాశం దక్కింది