Begin typing your search above and press return to search.

నిఖిల్ ప్రీ లుక్.. భలే కొత్తగా ఉందే

By:  Tupaki Desk   |   29 May 2016 9:04 AM GMT
నిఖిల్ ప్రీ లుక్.. భలే కొత్తగా ఉందే
X
వరుసగా డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్న నిఖిల్.. మరోసారి ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. గతేడాది రిలీజ్ అయిన శంకరాభరణం మినహాయిస్తే.. నిఖిల్ నుంచి ఈ మధ్య నిరాశపరిచే చిత్రాలు రాలేదు. వేటికవి డిఫరెంట్ కాన్సెప్ట్ లను ఎంచుకుంటూ కెరీర్ లో ఎదుగుతున్న నిఖిల్.. ఇప్పుడు వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు.

నిఖిల్ కి జంటగా హేభా పటేల్ - నందితాశ్వేతలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి.. ఇప్పుడు ప్రీ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ ఎప్పుడో చెప్పే పోస్టర్ నే ప్రీలుక్ అంటారు లెండి. అయితే.. కేవలం డేట్ వరకు చెప్పడం మాత్రమే కాకుండా.. చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ ప్రీ లుక్ డిజైన్ చేశారు. తాయెత్తులతో కట్టేసి దెయ్యాన్ని బంధించినట్లుగా ఉన్న ఓ సీసా.. దాని చుట్టూ పూసలు - రుద్రాక్షలు.. లోపల లవ్ సింబల్.. చూడగానే ఇదేంటబ్బా అని కాసేపు పరిశీలించడం ఖాయం.

పైగా ప్రేమ నుంచి తప్పించుకోలేరు అంటూ కాప్షన్ కూడా తగిలించారు. చూస్తుంటే ఇదేదా హారర్ కాన్సెప్ట్ అని అర్ధమయిపోతోంది. మరి ఈ జోనర్ లో ఇప్పటికే మెప్పించిన నిఖిల్.. మరోసారి ఆకట్టుకోవడం ఖాయం అనిపిస్తోంది.