Begin typing your search above and press return to search.

నిఖిల్ సినిమా కోసం ముగ్గురు డైరక్టర్లు

By:  Tupaki Desk   |   15 July 2017 5:57 PM GMT
నిఖిల్ సినిమా కోసం ముగ్గురు డైరక్టర్లు
X

'కేశవ' సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ కొడతాడనుకుంటే.. నిఖిల్ మాత్రం ఒక మోస్తరు విజయంతో సరిపెట్టేసుకున్నాడు. ఆ సినిమా తరువాత మనోడు గ్యాప్ తీసుకుని కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు చేద్దమాని అనుకుంటున్నాడు. అందులో ఒక ప్రాజెక్టు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. ఎందుకంటే ఆ సినిమా కోసం ఏకంగా ముగ్గురు డైరక్టర్లు పనిచేస్తున్నారు మరి.

కొత్త కుర్రాడు శరణ్‌ కొప్పిసెట్టి డైరక్షన్లో ఇప్పుడు నిఖిల్ ఒక సినిమాను చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం మరో ఇద్దరు డైరక్టర్లు కూడా వర్క్ చేస్తున్నారు. నిఖిల్ స్వామి రారా సినిమాతో తెరంగేట్రం చేసి మొన్న కేశవ ను డైరక్ట్ చేసిన సుధీర్ వర్మ ఈ కొత్త సినిమాకు స్ర్కీన్ ప్లే అందిస్తున్నాడు. అలాగే నిఖిల్ చేసిన కార్తికేయ సినిమాతో డైరక్టర్ గా పరిచయమైన చందు మొండేటి ఈ సినిమాకు మాటలు రాస్తున్నాడు. మొత్తానికి ఒక కొత్త కుర్రాడితో పాటు హిట్టు కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు సీనియర్లు ఇలా నిఖిల్ కోసం ముందుకొచ్చారనమాట. ఏకె ఎంటర్టయిన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

ఇకపోతే ఇంకో విశేషం ఏంటంటే.. తను ఒక సినిమా ఆడిషన్స్ కు వెళ్ళి ఎలాగైతే హ్యాపీ డేస్ అంటూ తెరంగేట్రం చేశాడో.. ఇప్పుడు తన సినిమాలో నటించడానికి కూడా అటువంటి ఆడిషన్సే కండక్ట్ చేస్తున్నాడు. ఓ ఎనిమిది మంది అబ్బాయిలూ.. ముగ్గురు అమ్మాయిలూ కావాలట. అది సంగతి.