Begin typing your search above and press return to search.

నాన్న కూచి గ్యాంగ్ మరో సినిమా

By:  Tupaki Desk   |   23 Jun 2018 4:27 AM GMT
నాన్న కూచి గ్యాంగ్ మరో సినిమా
X
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నీహారిక. టాలీవుడ్ లో పాపులారిటీ దక్కించుకునే క్రమంలో ఇంకా తొలి అడుగుల్లోనే ఉంది. ఆమె హీరోయిన్ గా నటించిన తొలి సినిమా ఒక మనసు బాక్సాఫీసును ఆకట్టుకోలేదు. తరవాత తండ్రి నాగేంద్రబాబుతో కలిసి నాన్న కూచి వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది. అంతకుముందు కెరీర్ లో మొదటగా ముద్దపప్పు - ఆవకాయ్ అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది.

నీహారిక నటించిన రెండు వెబ్ సిరీస్ లు డైరెక్ట్ చేసింది ప్రణీత్ బ్రహ్మాండపల్లి. ప్రణీత్ తాజాగా వెబ్ సిరీస్ డైరెక్టర్ నుంచి సినిమా దర్శకుడిగా ప్రమోషన్ కొట్టేశాడు. ఇతడు డైరెక్ట్ చేయబోతున్న సినిమాలో నీహారిక హీరోయిన్ గా నటించనుంది. ఇందులో కొరియోగ్రాఫర్ విజయ్ కొడుకు రాహుల్ విజయ్ హీరోగా నటించబోతున్నాడు. ఇదో ట్రావెల్ బేస్ డ్ రొమాంటిక్ కామెడీ అని డైరెక్టర్ ప్రణీత్ చెబుతున్నాడు. ఈ సినిమాలో కొంత పార్ట్ హైదరాబాద్ లోనూ.. మిగతా హిమాచల్ ప్రదేశ్ లోనూ షూట్ చేయబోతున్నారు.

అమెరికాలోని డిస్ట్రిబ్యూషన్ సంస్థ నిర్వాణ సినిమా ఈ మూవీని నిర్మించనుంది. ఈ మూవీలో ఇంకో ఇంపార్టెంట్ లేడీ రోల్ కూడా ఉందట. ఈ పాత్ర ఎవరూ చేసేది ఇంకా ఫైనలైజ్ చేయలేదు. నిహారిక రీసెంట్ గా సుమంత్ అశ్విన్ తో కలిసి హ్యాపీ వెడ్డింగ్ సినిమా చేసింది. ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.