సొంత వ్యక్తి అనే నీహారిక ఒప్పుకుందా!?

Mon Jun 19 2017 17:45:57 GMT+0530 (IST)

మెగా డాటర్ కొణిదెల నీహారిక రెండో తెలుగు సినిమా ఒప్పుకున్న విషయం ఇప్పటికే చెప్పుకున్నాం. గతేడాది జూన్ చివరి వారంలో విడుదల అయిన ఒక మనసు చిత్రం తర్వాత.. దాదాపు ఏడాది పాటు గ్యాప్ తీసుకుంది నీహారిక.  కొన్ని వారాల క్రితం ఓ తమిళ్ సినిమా ఒప్పుకుంది నీహారిక. విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది మెగా డాటర్.

అయితే.. తెలుగులో సినిమా విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు వహిస్తోంది. సెకండ్ ఫిలిం విషయంలో చాలానే ఆప్షన్స్ వినిపించినా.. చివరకు దుర్గా ప్రసాద్ అనే కొత్త దర్శకుడితో సినిమాకు ఒప్పుకోవడం ఆశ్చర్యం కలిగించింది. అయితే.. ఇతను మెగాస్టార్ ఫ్యామిలీకి కావాల్సిన వ్యక్తి అని తెలుస్తోంది. అంటే కొణిదెల కుటుంబానికి కాసింత దూరపు చుట్టమే ఈ దుర్గా ప్రసాద్ అంటున్నారు. దర్శకుడు మెహర్ రమేష్ కి బంధువు అయిన ఈయన.. చిరంజీవికి కూడా బంధువు కావడం గమనించాల్సిన విషయం.

ఈ వార్తలపై నీహారిక రియాక్ట్ అయింది. 'అవును.. దుర్గాప్రసాద్ మా బంధువే. అయితే.. తనతో సినిమాకి ఒప్పుకునేందుకు అదొక్కటే కారణం కాదు. అతను చెప్పిన స్క్రిప్ట్ పక్కాగా ఉండడంతోనే సినిమా చేసేందుకు సిద్ధమయ్యాను. అతను కొత్త దర్శకుడే అయినా మెహర్ రమేష్ దగ్గర పని చేసిన అనుభవం ఉంది' అని చెప్పింది నీహారిక

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/