వారికి భయపడే నాకు ప్రపోజ్ చేయడం లేదు:నిహారిక

Sun May 20 2018 17:18:57 GMT+0530 (IST)

మెగా స్టార్ చిరంజీవి మొదలుకొని తాజాగా అరంగేట్రం చేయబోతోన్న ఆయన అల్లుడి వరకు చాలామంది హీరోలు ఆ ఫ్యామిలీ నుంచి వచ్చారు. పవన్ కల్యాణ్ - అల్లు అర్జున్ - రామ్ చరణ్ - శిరీష్ - సాయి ధరమ్ తేజ్ - వరుణ్ తేజ్...వీరంతా మెగా అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. అయితే ఆ ఫ్యామిలీ నాగబాబు కూతురు నిహారిక మాత్రమే  హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత అందరు హీరోయిన్ల లాగే నిహారికపై కూడా లవ్ పుకార్లు షికార్లు చేశాయి. కొద్ది రోజుల క్రితమైతే....ప్రభాస్ తో నిహారిక మ్యారేజ్ ఫిక్స్ కాబోతోందని కూడా పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత వాటిని మెగా ఫ్యామిలీ ఖండించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తన లవ్ ప్రపోజల్స్ తనకున్న మెగా ఇమేజ్ గురించి నిహారిక ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో తన కాలేజ్ డేస్ నుంచి సినీ కెరీర్ వరకు అన్ని విషయాల గురించి మనసు విప్పి మాట్లాడింది.తనను మెగా ప్రిన్సెస్ అని పిలవడం ఇష్టం లేదని నిహారిక చెప్పింది. తనకు ఇప్పటి వరకు ఎటువంటి లవ్ ప్రపోజల్స్ రాలేదని నిహారిక చెప్పింది. అందరూ అనుకున్నట్లు తనకు విచ్చలవిడిగా లవ్ ప్రపోజల్స్ రాలేదని తెలిపింది. తన వెనుక నాన్న - అన్నయ్య - డాడీ(చిరంజీవి)కనిపించడం వల్ల ఎవరూ ప్రపోజ్ చేసే ధైర్యం చేయలేదని చెప్పింది.

అందరమ్మాయిల్లాగే తనకూ ఎవరన్నా లవ్ ప్రపోజ్ చేస్తే బావుండు అనిపిస్తుందని....చెప్పింది. తను కూర్చున్న టేబుల్ ముందు లవ్ లెటర్ పెట్టినా ఫస్ట్ లవ్ ప్రపోజల్ అని దాచి పెట్టుకోవాలని అనిపిస్తుందని చెప్పింది. కాలేజ్ టైమ్ లో కూడా ఎవడైనా ప్రపోజ్ చేయకపోతాడా అని ఎదరుచూశానని తెలిపింది. తాను బాగుండనేమో...అందుకే ఎవరూ ప్రపోజ్ చేయడం లేదేమో...అని కూడా అనిపిస్తుందని చెప్పింది. తన తండ్రి నాగబాబు చాలా బ్రాడ్ మైండెడ్ అని తనకు తగినంత ఫ్రీడమ్ ఇచ్చారని చెప్పింది. తనకు పెళ్లి చూపులంటే ఇష్టమని మా అమ్మానాన్నల పెళ్లి చూపుల స్టోరీ చాలా క్యూట్ గా ఉంటుందని చెప్పింది. తాను పెళ్లిచూపుల్లో నడవాల్సి వస్తే ‘గంగ' చిత్రంలో నిత్యా మీనన్ లా కుంటుకుంటూ నడుస్తానని జోక్ చేసింది. అలాంటి పెళ్లి చూపులు కాకుండా...ఈ జనరేషన్ కు తగ్గ పెళ్లిచూపులు ఇష్టమని చెప్పింది. .