Begin typing your search above and press return to search.

ఖైదీలో కనువిందు చేయనున్న మెగా డాటర్?

By:  Tupaki Desk   |   31 Aug 2016 5:10 AM GMT
ఖైదీలో కనువిందు చేయనున్న మెగా డాటర్?
X
మెగా ఫామిలీ నుండి పరిచయమైన మొదటి నాయికగా కొణిదెల నిహారికకి ఇండస్ట్రీలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒకమనసు సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచమైన ఈ భామకు ఆశించిన బ్రేక్ రాలేదు. అందుకే తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టనుంది.

తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం చిరంజీవి కమ్ బ్యాక్ మూవీలో నిహారిక కనిపించనుందట. ఆమెకోసం ప్రత్యేకంగా ఒక పాత్రను సృష్టించమని చిరు వినాయక్ ని కోరాడట. దాని మీద వినాయక్ ఇప్పటికే కసరత్తులు చేయడం ప్రారంభించినట్టు తెలుస్తుంది.

పరుచూరి బ్రదర్స్ తమిళ వెర్షన్ కి బోలెడు మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తుంది. వాటి మధ్యలో ఒక పాత్ర సృష్టించడం పెద్ద కష్టమేమికాదు. అయితే ఈ పాత్ర హిట్ అయ్యి నిహారిక కెరీర్ కి బూస్ట్ అయితే చిరుకి అంతకన్నా ఆనందం వేరే వుంటుందా?