మెగా సిస్టర్స్ విదేశీ విహారం

Mon May 20 2019 15:00:34 GMT+0530 (IST)

మెగా ప్రిన్సెస్ నీహారిక కెరీర్ అప్స్ అండ్ డౌన్స్ గురించి తెలిసిందే. వరుసగా క్లాస్సీ సినిమాల్లో నటిస్తూ మెగా గాళ్ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. అయితే సరైన హిట్టు మాత్రం ముఖం చాటేస్తోంది. 2018-19 సీజన్ లో హ్యాపి వెడ్డింగ్.. సూర్యకాంతం చిత్రాలపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే అవి రెండూ బాక్సాఫీస్ వద్ద ఫెయిలయ్యాయి.  ఆ తర్వాత వేరొక సినిమా గురించిన ప్రకనటనా లేదు. ప్రస్తుతం నిహారిక సొంతంగా ఓ వెబ్ సిరీస్ ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన సంగతి  తెలిసిందే. మరోవైపు నిహారిక పెళ్లి ఈ ఏడాది ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.నాలుగేళ్ల తర్వాత నేను చెప్పిన కుర్రాడితో లేదా నీకు నచ్చిన యువకుడితో పెళ్లికి ఒప్పుకోవాలని డాడ్ నాగబాబు కండిషన్ పెట్టారని చెప్పిన నిహారిక ఆ మాటకు కట్టుబడి ఉన్నానని ఇటీవల ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఆ ప్రకారం చూస్తే ఇప్పటికే కెరీర్ ప్రారంభించి నాలుగేళ్లయ్యింది. మెగా ప్రిన్సెస్ ఇక పెళ్లాడేస్తున్నారా? అన్నది తెలియాల్సి ఉంది. పెళ్లి మాటేమో కానీ ఈ సమ్మర్ కి వెకేషన్ ఎక్కడ  ప్లాన్ చేశారు? అని ప్రశ్నిస్తే ఇదిగో సామాజిక మాధ్యమాల వేదికగా నిహారిక ఇచ్చిన ఆన్సర్ ఇంట్రెస్టింగ్.

నిహారిక ప్రస్తుతం ఓ అరుదైన లొకేషన్ లో సమ్మర్ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అది కూడా మెగా డాటర్.. ఫ్యాషన్ డిజైనర్ సిస్టర్ సుశ్మిత తో కలిసి గోర్డాన్ గ్రమ్ అనే అరుదైన లొకేషన్ కి వెళ్లారు. విశాలమైన సముద్ర వాతావరణం.. నదీజలాలు ఇక్కడ ప్రత్యేకత. నిరంతరం ఎంతో కూల్ గా ఉండే లొకేషన్ అది. ``నా ఫేవరెట్ సుశ్మిత కొణిదెలతో కలిసి మొదటిసారి ఇలా ట్రిప్ కి వచ్చాను. ఇక్కడ కిచెన్ ఫుడ్ లవ్ లీ`` అంటూ ఇన్ స్టాలో కామెంట్ ని పోస్ట్ చేశారు నిహారిక. గోర్డాన్ గ్రమ్ లో ప్రత్యేకించి స్థానిక ఫుడ్డింగ్ విధానం ఎంతో ఎగ్జయిట్ చేస్తుందని పర్యాటకులు చెబుతుంటారు. అక్కడ గోర్డాన్ రామ్సే అనే ఒకాయన వంటకాలు సంథింగ్ స్పెషల్ అన్న పాపులారిటీ ఉంది.