Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: నిహారిక.. నువ్వేనా?

By:  Tupaki Desk   |   19 March 2018 4:32 PM GMT
ఫోటో స్టోరి: నిహారిక.. నువ్వేనా?
X
ఎక్కడైనా సరే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో కూతురు సినిమాల్లోకి వస్తోంది అంటే చాలు అభిమానులు ఓ తరహాలో ఎదురుచూస్తుంటారు. కానీ టాలీవుడ్ లో మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. సింపుల్ గా ఎంట్రీ ఇచ్చి ఓ లెవెల్ వరకు హీరోయిన్ గా కొనసాగితే ఒకే గాని గ్లామర్ గీతను ఏ మాత్రం టచ్ చేసినా కూడా అస్సలు ఒప్పుకోరు. హాలీవుడ్ బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోల కూతుళ్లు ఓ మోడల్ లెవెల్లో హోయాలను ఒలకబోస్తారు.

ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. గత కొంత కాలం నుంచి మెగా ఫ్యామిలీ నుంచి ఎక్కువగా హీరోలే వచ్చారు. వారి నుంచి ఒక్కగానొక్క అమ్మాయి నాగబాబు కుమార్తె నిహారిక టీవీ షోల ద్వారా మొదట ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ తరువాత సింపుల్ గా ఒక లవ్ స్టోరీలో కనిపించి మెప్పించింది. ఇకపోతే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఫొటోషూట్ లో నిహారిక ఎవరు ఉహించని విధంగా కనిపించింది. అసలు ఆమె ఇచ్చిన స్టిల్ ని చూస్తే ఎవరు ఈ బాలీవుడ్ హీరోయిన్ అని అనకుండా ఉండలేరు.

మోడ్రన్ అమ్మాయిలా బ్లూ జీన్స్ వైట్ టిషర్ట్ లో నవ్వుతూ టేబుల్ మీద కూర్చున్న నిహారిక చాలా అందంగా కనిపించింది. సరికొత్త హెయిర్ స్టైల్ తో నిండుగా ఒక స్మైల్ ని తగిలిచడంతో ఫొటో కి కళ వచ్చిందని చెప్పవచ్చు. ఇంత వరకు నిహారిక ఇంత అందంగా ఎప్పుడు కనిపించలేదని మెగా అభిమానులు చాలా పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.