జపాన్ లో మెగా డాటర్ సందడి

Thu May 24 2018 16:49:34 GMT+0530 (IST)


మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మొదటి నటీమణి నిహారిక లైఫ్ ని జాలిగా ఎంజాయ్ చేయడంలో ముందుంటారు. ఎప్పుడు కనిపించినా నవ్వుతూ కెమెరాకు స్టిల్ ఇవ్వడం ఆమె స్పెషాలిటీ. గ్లామర్ హీరోయిన్ రేంజ్ లో కాకపోయినా తనవరకు కొన్ని సినిమాలతో హీరోయిన్ గా బాగానే రాణిస్తోంది. ఇక చాలా కాలం తరువాత నిహారిక ఒక లాంగ్ సమ్మర్ ట్రిప్ వేసింది. ఎప్పటి నుంచో వెళ్లాలి అనుకుంటున్న జపాన్ కి ఇటీవల మెగా డాటర్ ప్లాన్ చేసుకొని వెళ్లింది.ప్రస్తుతం జపాన్ వాతావరణాన్ని హ్యాపీగా ఆస్వాదిస్తోంది. ఎక్కడ ఎలాంటి స్పెషల్ ప్రదేశాలు కనిపించినా ఫొటోలకు స్టీల్ ఇస్తోంది. ముఖ్యంగా టోక్యో సిటీలో ప్రముఖ ప్రదేశాలను చూస్తూ ఒక దగ్గర సుమో ఫైట్ ను కూడా ఎంజాయ్ చేసిందట. అలాగే అగ్నిపర్వతం అయిన మౌంట్ ఫుజీ దగ్గర ఒక అందమైన ఫొటో దిగింది. చూస్తుంటే కొన్ని ఫొటోల్లో నిహారిక గ్లామర్ గర్ల్ గా రెడీ అయినట్లు కనిపిస్తోంది. గాగుల్స్ తో పోజ్ ఇచ్చిన ఫొటోలకు ప్రస్తుతం నెటిజన్స్ నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

తన హాలిడేస్ ట్రిప్ మొత్తం పోటోలను ఇన్ స్టాగ్రామ్ ద్వారా తన ఫాలోవర్స్ తో పంచుకుంటోంది. సోషల్ మీడియాలో కూడా అమ్మడు చాలా స్పీడ్ గా కనిపిస్తుంటుంది. ఇకపోతే నిహారిక ఇటీవల హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఆ సినిమా త్వరలోనే విడుదల కానుంది.