Begin typing your search above and press return to search.

రెప్పపాటులో మాయమైన మెగా డాటర్!

By:  Tupaki Desk   |   19 Sep 2019 11:10 AM GMT
రెప్పపాటులో మాయమైన మెగా డాటర్!
X
మెగాస్టార్ చిరంజీవి 'సైరా' ట్రైలర్ నిన్న రిలీజ్ అయినప్పటి నుంచి ఒక్కసారిగా అందరి దృష్టి 'సైరా' పై పడింది. ట్రైలర్ లో ఉండే అంశాల గురించి ఇప్పటికే చాలా విశ్లేషణలు వచ్చాయి కానీ ఇందులో మెగా డాటర్ నిహారికను ఎవరూ పెద్దగా గమనించినట్టు కనిపించడం లేదు. ట్రైలర్ ను చాలా కీన్ గా చూస్తేనో.. లేక రిపీట్ మోడ్ లో నాలుగైదు సార్లు చూస్తేనో తప్ప నిహారికను గుర్తించడం కష్టం.

ఆల్రెడీ మీరు నిహారిక ట్రైలర్ లో ఎక్కడ కనిపించిందో గమనిస్తే సరే.. అలా కాకపోతే ట్రైలర్ లో సరిగ్గా 2.24 నిముషాల నుండి 2.26 నిముషాల వరకూ చూడండి.. నిహారిక తన తోటి మహళా సైనికులతో యుద్ధరంగంలో శత్రువుల వైపుకు పరిగెడుతూ కనిపిస్తుంది. సినిమాలో నిహారిక పాత్ర నిడివి తక్కువ సేపే ఉంటుందని.. అయితే అది కీలకపాత్రేనని గతంలోనే వార్తలు వచ్చాయి. సినిమాలో చిరుతో పాటుగా భారీ తారాగణం ఉంది కాబట్టి నిహారికకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని భావించలేం.

సినిమా రిలీజ్ అయితే కానీ నిహారిక పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో.. ఎంత స్క్రీన్ టైం ఉందన్న విషయంలో క్లారిటీ రాదు. అయితే నిహారిక ఇప్పటివరకూ నటించిన సినిమాలేవీ హిట్ కాలేదు. మరి ఈ సినిమాతో అయినా నిహారిక ఒక హిట్ సినిమాలో భాగస్వామి అయిన నటిగా పేరు తెచ్చుకుంటుందేమో వేచి చూడాలి. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం అక్టోబర్ 2 వ తారీఖునే లభిస్తుంది.