Begin typing your search above and press return to search.

మెగా డాటర్ కోసం మెగా బ్యాచ్‌

By:  Tupaki Desk   |   10 Oct 2015 1:30 AM GMT
మెగా డాటర్ కోసం మెగా బ్యాచ్‌
X
మెగా బ్రదర్ నాగేంద్రబాబు తనయ నీహారిక.. హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతోందన్నది పాత విషయమే. కాకపోతే.. మూవీ సెట్టైనా ముహూర్తం ఇప్పుడే కుదిరింది. ఈ నెల 30 నీహారిక నటించబోతున్న సినిమాని స్టార్ట్ చేయబోతున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరోయిన్ కావడంతో.. ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ గానే నిర్వహించాలని నిర్ణయించారు.

మెగా డాటర్ హీరోయిన్ గా నటించబోతున్న మూవీలో హీరో నాగశౌర్య. మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు చిత్రాన్ని తీసిన రామరాజు డైరెక్టర్ కాగా.. మధుర శ్రీధర్ - టీవీ9 కలిసి నిర్మించబోతున్నాయి. కాస్టింగ్ ప్రకారం చూస్తే.. ఇది పెద్ద బడ్జెట్ మూవీ కాకపోయినా.. మెగా డాటర్ నీహారిక ఎంట్రీతో బడా సినిమా అయిపోయింది. అందుకే గ్రాండ్ ఫంక్షన్ చేయనున్నారు. హైటెక్స్ వేదికగా జరిగే ఈ కార్యక్రమానికి చిరంజీవి సహా మెగా ఫ్యామిలీ అంతా రాబోతున్నారని తెలుస్తోంది.

నీహారిక తండ్రి నాగబాబు - రామ్ చరణ్ - బ్రదర్ వరుణ్ తేజ్ - అల్లు అరవింద్ - బన్నీ.. ఇలా అందరూ ఈ ప్రోగ్రాంకి అటెండ్ కాబోతున్నారని తెలుస్తోంది. ముకుంద మూవీ ప్రారంభ సమయంలో వరుణ్ తేజ్ కోసం అప్పట్లో వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ఈ సారి ఏం చేస్తారో ఇంకా తెలీదు.

రీసెంట్ టైంలో స్టార్ హీరోల ఫ్యామిలీ నుంచి వస్తున్న మొదటి హీరోయిన్ నీహారికే అవుతుంది. అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ పక్కన.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో నాగార్జున మేనకోడలు సుప్రియ చేసిన తర్వాత.. మళ్లీ ఏ స్టార్ ఫ్యామిలీ నుంచీ హీరోయిన్ రాలేదు. నీహారిక ఆ రికార్డ్ బ్రేక్ చేయబోతోంది.