Begin typing your search above and press return to search.

లవర్ ని తెచ్చి ఆమెని బాధపెట్టాడు

By:  Tupaki Desk   |   21 July 2017 4:44 PM GMT
లవర్ ని తెచ్చి ఆమెని బాధపెట్టాడు
X
టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన మున్నా మైకేల్ మూవీ ఇవాళే థియేటర్లలోకి వచ్చింది. కంప్లీట్ గా మళ్లీ తన యాక్షన్ విశ్వరూపాన్ని చూపించేశాడు ఈ కుర్ర హీరో. డ్యాన్సింగ్ థీమ్ తో రూపొందిన ఈ చిత్రానికి టాక్ కూడా బాగానే ఉంది.

అయితే.. ముంబైలో మున్నా మైకేేల్ మూవీ ప్రీమియర్ షో సందర్భంగా ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. ఈ చిత్రం ద్వారా నిధి అగర్వాల్ అనే యంగ్ బ్యూటీ బాలీవుడ్ కి పరిచయం అవుతోంది. ఏకంగా 300 మందిని ఫిల్టర్ చేసి.. ఈ భామను సెలక్ట్ చేశారు మేకర్స్. సినిమా రిలీజ్ అయ్యే వరకూ డేటింగ్ చేయననే ఒప్పందం చేసుకుని మరీ ఈ సినిమా చేసింది నిధి. అయితే.. ప్రమోషన్స్ లో తనకు అందుకు తగ్గ ప్రయోజనం లభిస్తుందని ఈ భామ ఆశించింది. పబ్లిసిటీ యాక్టివిటీస్ లో ఎంతో కీలకమైన ప్రీమియర్ షోకి.. హీరో టైగర్ ష్రాఫ్ లవర్ గా అంతా భావిస్తున్న దిశా పటానీతో అటెండ్ అయ్యాడు. ఈ సీన్ చూసి నిధి అగర్వాల్ కి షాక్ కొట్టేసింది.

దిశా పటానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ కావడం.. పైగా టైగర్- దిశాలు కలిసి కెమేరాలకు చిక్కడంతో మీడియా ఫోకస్ అంతా అటువైపు మళ్లేసింది. ఈ సంఘటనతో నిధి అగర్వాల్ తెగ డిజప్పాయింట్ అయిపోయిందట. అయినా.. ఈ భామతో సినిమా చేసి ఆ భామను వెంటేసుకుని ప్రీమియర్ షోకి అటెండ్ కావడం ఏంటో టైగర్ ష్రాఫ్ మాత్రమే చెప్పాలి.