Begin typing your search above and press return to search.

కంగ్రాట్స్ చెబుతున్న సొగసుల నిధి

By:  Tupaki Desk   |   17 Nov 2017 2:18 PM GMT
కంగ్రాట్స్ చెబుతున్న సొగసుల నిధి
X
బెంగళూరులో పుట్టినా తనకు హైద్రాబాద్ తో బోలెడంత లింక్ ఉందని.. తనకు ఈ ఊరు సెకండ్ హోమ్ అని గర్వంగా చెబుతున్న లేటెస్ట్ బ్యూటీ నిధి అగర్వాల్. మున్నా మైఖేల్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఇప్పుడు టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న సవ్యసాచి చిత్రం ద్వారా తెలుగు సినిమాల్లో అడుగు పెడుతున్న ఈ భామ.. ఇక్కడి జనాలను ఆకట్టుకునేందుకు అన్ని అస్త్రాలను ప్రయోగించేస్తోంది.

తాజాగా ప్రకటించిన నంది అవార్డులలో చందూ మొండేటి ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా కార్తికేయ చిత్రానికి అవార్డు వచ్చింది. ఇప్పుడు సవ్యసాచి మూవీ తొలి షెడ్యూల్ పూర్తయిపోయిందంటూ దర్శకుడు చందూ మొండేటితో దిగిన ఓ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ చెబుతున్న నిధి అగర్వాల్.. కార్తికేయ చిత్రానికి నంది అవార్డ్ గెలుచుకున్నందుకు.. ఈ దర్శకుడికి అభినందనలు కూడా చెబుతోంది. మరోవైపు.. ఈ సుందరాంగిపై టాలీవుడ్ అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.

రాబోయే కాలంలో కాబోయే సమంత రేంజ్ హీరోయిన్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. యాక్టింగ్.. డ్యాన్సింగ్.. అందచందాలు.. ఆరబోతలు.. అన్నీ ఉన్న ఈ భామ.. టాలీవుడ్ లో సత్తా చాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని.. టాప్ హీరోయిన్ రేస్ లో తప్పకుండా నిలుస్తుందని అంటున్నారు. అయితే.. ఈమెకు కావాల్సిందల్లా హిట్ సినిమాతో లాంఛింగ్ అంతే. ఆ కోరికను చందూ మొండేటి తీర్చేస్తాడని ఆశిద్దాం.