Begin typing your search above and press return to search.

ఇలా న‌వ్వితే ముత్యాలు రాలునేమో!

By:  Tupaki Desk   |   17 Aug 2018 11:30 AM GMT
ఇలా న‌వ్వితే ముత్యాలు రాలునేమో!
X

అంత‌గా అలా న‌వ్వ‌కు.. కొంటెగా ఇలా రువ్వ‌కు!! అంటూ ఈ అమ్మ‌డిని చూస్తే సాంగేసుకోవాల్సిందే. అందాల నిధి అగ‌ర్వాల్ ఇంకా టాలీవుడ్ లో అడుగుపెట్ట‌క ముందే త‌న‌దైన `సామాజిక‌` విన్యాసాల‌తో కుర్ర‌కారు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఒకేసారి అక్కినేని ఫ్యామిలీ హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకుంది నిధి. నాగ‌చైత‌న్య స‌ర‌స‌న `స‌వ్య‌సాచి` చిత్రంలో న‌టిస్తుండ‌గానే, అఖిల్ మూడో చిత్రంలోనూ ఛాన్స్ కొట్టేసి ఆశ్చ‌ర్య‌పరిచింది.

సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే ఇరు సినిమాల‌ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్రమాల‌తో బ‌రిలో దిగిపోవ‌డానికి రెడీ అవుతోంది. అలానే అఖిల్ మూడో సినిమా జెట్‌ స్పీడ్‌ తో పూర్త‌వుతోంది కాబ‌ట్టి, అన్న‌ద‌మ్ముల సినిమాల‌తో నిధి పాపులారిటీ ఒక్క‌సారిగా రెట్టింపు అవ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

ఈలోగానే ఇదిగో ఇలా కొంటెగా న‌వ్వులు రువ్వుతూ .. ఆ ఫోటోల్ని ఇన్‌ స్టాగ్ర‌మ్‌ లో షేర్ చేస్తూ యూత్‌ కి ట‌చ్‌ లో ఉంది. న‌వ్వి గుండె కోసేస్తోంది. ఇలా న‌వ్వితే ఆ నోటి నుంచి ముత్యాలు రాలునేమో! అన్నంత అందంగా న‌వ్వేస్తూ క‌వ్విస్తూ గిలిగింత‌లు పెట్టేస్తోంది. ఆ న‌వ్వులోనే ఆ దోర‌పెద‌వుల‌తో వ‌ల‌పు దోపిడీ చేసేస్తోంది. నిధి సినిమాల్లోకి రాక‌ముందే మోడ‌లింగ్‌లో అడుగుపెట్టి అక్క‌డ ప్ర‌కంప‌నాలు సృష్టించింది. అటుపై బాలీవుడ్ - క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టించేస్తోంది. ప్ర‌స్తుతం సౌత్‌ లో తెలుగు - త‌మిళ్ ప‌రిశ్ర‌మ‌ల్లో అమ్మ‌డికి క్రేజీగా ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయ‌ని తెలుస్తోంది. అలా న‌వ్వులు రువ్వి ఛాన్స్ ప‌ట్టేస్తోంద‌న్న‌మాట‌!