Begin typing your search above and press return to search.

అబ్బాయితో సెక్స్ చేసిన హీరోయిన్ లవ్వర్?

By:  Tupaki Desk   |   25 Jun 2018 5:01 PM GMT
అబ్బాయితో సెక్స్ చేసిన హీరోయిన్ లవ్వర్?
X
ఏంటి షాక్ అయ్యారా? లేకపోతే రూమర్ అనుకుంటున్నారా?. బాలీవుడ్ లో ప్రస్తుతం ఈ మ్యాటర్ చాలా వైరల్ అవుతోంది. హాలీవుడ్ లో పెద్దగా ప్రభావం చూపడం లేదు గాని ప్రియాంక నేమ్ వచ్చింది కాబట్టి హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా గత కొంత కాలంగా నిక్ జోనస్ తో ప్రేమ వ్యవహారాన్ని నడుపుతున్న సంగతి తెలిసిందే.

హాలీవుడ్ లో నిక్ జోనస్ మ్యూజిషియన్ గా మంచి పాపులారిటీని సంపాదించుకుంటున్నాడు. 25 ఏళ్ల నిక్ తనకంటే 10 ఏళ్లు పెద్దదైన ప్రియాంక మాయలో పడ్డాడు. రీసెంట్ గా అమ్మడు అతన్ని ముంబై తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక అసలు విషయంలోకి వెళితే.. ప్రియాంక బాయ్ ఫ్రెండ్ నిక్ ఓ యూస్ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక షాకింగ్ విషయాన్ని చెప్పాడు. మీరు ఒక వ్యక్తితో సెక్స్ లో పాల్గొన్నారు కదా? అని అడగ్గానే అతను డిఫెరెంట్ ఆన్సర్ ఇచ్చాడు. ''నేను గే కాదు కాని.. ఒక అబ్బాయితో మాత్రం సెక్స్ చేశాను. దానిలో పెద్దగా దాచుకోవాల్సిన విషయం ఏమీ లేదు'' అనేశాడు నిక్ బాబు.

''నాకు డేటింగ్ లో ఉండడం అంటే నాకు చాలా ఇష్టం. అలాగే నిజాయితీగా ఉంటాను'' అని అతను మరో మాట కూడా చెప్పాడు. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి మీడియా కంట పడితే ప్రియాంక ఏ విధంగా ఈ విషయం గురించి స్పందిస్తుందో చూడాలి.