Begin typing your search above and press return to search.

అప్పుడే తండ్రి కావాలనుందట

By:  Tupaki Desk   |   15 Dec 2018 10:43 AM GMT
అప్పుడే తండ్రి కావాలనుందట
X
బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు ఇండియా వ్యాప్తంగా ప్రియాంక చోప్రా మరియు నిక్‌ జోనాస్‌ ల ప్రేమ గురించి మాట్లాడుకున్న విషయం తెల్సిందే. దాదాపు పది సంవత్సరాల వయస్సు తేడ ఉన్న వీరిద్దరి మద్య ప్రేమ ఏంటీ అంటూ కొందరి విమర్శిస్తే మరి కొందరు మాత్రం వీరి ప్రేమ ప్రత్యేకం అంటూ పొగడ్తలు కురిపించారు. తాజాగా వీరి పెళ్లి భారీ ఎత్తున రాజస్థాన్‌ లో నిర్వహించడం జరిగింది. ప్రముఖులు హాజరు అయిన ఈ వివాహ వేడుక గురించి జాతీయ మరియు అంతర్జాతీయ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి.

దాదాపు నెల రోజుగా ఈ జంట గురించి ఏదో ఒక న్యూస్‌ వస్తూనే ఉంది. తాజాగా నిక్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు అర్జంట్‌ గా తండ్రి అవ్వాలని ఉందని చెప్పుకొచ్చాడట. పిల్లలకు తండ్రిగా అవ్వడం కోసం చాలా ఎగ్జయిట్‌ మెంట్‌ తో ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడట. తండ్రి అయ్యేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నిక్‌ కు పీసీ నుండి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుందో అంటూ కొందరు భావిస్తున్నారు.

సహజంగా హీరోయిన్స్‌ ఎక్కువ శాతం మంది పెళ్లి తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకుని మ్యారేజ్‌ లైఫ్‌ ను ఎంజాయ్‌ చేసి ఆ తర్వాత పిల్లలను ప్లాన్‌ చేస్తారు. కాని గతంలో ప్రియాంక చోప్రా మాత్రం తనకు పిల్లలు అంటే చాలా ఆసక్తి అని చెప్పుకొచ్చింది. అందుకే నిక్‌ ను తండ్రిని చేసేందుకు పీసీ కూడా వెంటనే ఓకే చెప్పొచ్చు. వీరిద్దరు కలిసి త్వరలోనే ఆ గుడ్‌ న్యూస్‌ చెబుతారేమో చూడాలి. ప్రస్తుతం వీరు ఓమన్‌ లో హనీమూన్‌ ను ఎంజాయ్‌ చేస్తున్నట్లుగా బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అక్కడ నుండి క్రిస్మస్‌ వేడుకలకు అమెరికా వెళ్లనున్నారట.