జక్కన్న డబుల్ ధమాకా మూవీస్

Fri Oct 13 2017 13:04:33 GMT+0530 (IST)


బాహుబలి దర్శకధీరుడు రాజమౌళి తన సినిమాలో సస్పెన్స్ ఏ స్థాయిలో పెడతాడో తెలిసిందే. కానీ నెక్స్ట్ సినిమా ఎలాంటి సినిమా తీస్తాడు ఎవరితో తీస్తాడు అనే విషయంలో మాత్రం ఉహాలకందని సస్పెన్స్ తో టాలీవుడ్ ప్రేక్షకుల ఓపికకు పరీక్ష పెడుతున్నారు.  అయితే ఫైనల్ గా ఆ సస్పెన్స్ కి కొంచెం క్లారిటీ ఇచ్చాడు జక్కన్న. బాలీవుడ్ మీడియా కూడా ఈ న్యూస్ కోసమే చాలా రోజుల నుండి ఎదురుచూస్తోంది.అయితే నెక్స్ట్ సినిమా తర్వాత కూడా.. ఎవ్వరు నెక్స్ట్ ఏంటి? అనకుండా మరో సినిమాపై కూడా రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. అంటే ఒకేసారి రెండు ప్రాజెక్టుల గురించి చెప్పేశాడు. మొదట డివివి. దానయ్య నిర్మాణ సారధ్యంలో ఒక మంచి సోషల్ డ్రామా ఉన్న కథను తెరకెకెక్కించడానికి రెడీ అయ్యాడు. అయితే ఆ సినిమాలో నటీనటులు ఎవరనేది ఇంకా డిసైడ్ అవ్వలేదని కాకపోతే స్టార్ హీరోతోనే ఉంటుందని జక్కన్న ఒక అంతర్జాతీయ మీడియా ఛానల్ తో చెప్పారు. ఇక ఆ తర్వాత ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఎప్పటి నుండో  మహేష్ తో రాజమౌళి సినిమాను చేయాలని అనుకుంటున్నారు. ఫైనల్ గా కె.ఎల్ నారాయణ నిర్మాతగా 2019లో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని రాజమౌళి తెలిపారు.

ప్రస్తుతం మహేష్ కొరటాల శివతో భారత్ అనే నేను సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఆ తర్వాత వంశీ పైడిపల్లి తో ఒక సినిమాను చేస్తారు. ఆ సినిమా అయిపోయాక అప్పుడు మహేష్ - రాజమౌళి సినిమా సెట్స్ పైకి వెళుతుంది. సో..అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.