Begin typing your search above and press return to search.

కొత్తోళ్లకు 2017 కలిసిరావట్లే!!

By:  Tupaki Desk   |   25 Jun 2017 10:25 AM GMT
కొత్తోళ్లకు 2017 కలిసిరావట్లే!!
X
గతేడాది టాలీవుడ్ లో కొత్త ఆర్టిస్టులు.. టెక్నీషియన్స్ బాగానే వెలిగారు. క్షణం.. పెళ్లి చూపులు లాంటి బ్లాక్ బస్టర్స్ కూడా పడ్డాయి. కానీ 2017 సంవత్సరం అప్పుడే సగం పూర్తయిపోతోంది. అయినా సరే ఇప్పటివరకూ కొత్తవాళ్లకు కలిసొచ్చిందేమీ కనిపించడం లేదు.

రీసెంట్ గా కాదలి మూవీ తో పూజా కె దోషి.. హరీష్ కళ్యాణ్.. సాయి రోనక్ కు అదృష్టం పరీక్షించుకున్నారు. ప్రీ రిలీజ్ పబ్లిసిటీ బాగున్నా.. జనాల నుంచి సపోర్ట్ మాత్రం లభించలేదు. గత కొన్ని నెలలుగా 'రాముడింట కృష్ణుడంట'.. 'ఓ పిల్లా నీ వల్లా'.. 'రాజా మీరు కేక'.. ఇలా పలు సినిమాలతో కొత్త వాళ్లు దాదాపు ఓ 10- 15 మంది ప్రయత్నించారు కానీ.. ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయాయి. వీటిలో కొన్నింటి కంటెంట్ నిజంగానే బాగోకపోతే.. మరికొన్ని మాత్రం రిలీజ్ టైం సరిగా కుదరక జనాలను మెప్పించలేకపోయాయి. మొత్తంగా అయితే టాలీవుడ్ లో కొత్తవారికి ప్రస్తుతం టైం బాలేదనే చెప్పాలి.

'తమిళ్.. మలయాళం మాదిరిగా మన దగ్గర కొత్త ట్యాలెంట్ ను ప్రోత్సహించే అలవాటు ఆడియన్స్ కు లేదు. హ్యాపీడేస్.. ఉయ్యాలా జంపాలా.. పెళ్లి చూపులు వంటి కొన్ని సినిమాలు ఇందుకు మినహాయింపు అయినా.. మన జనాలు ఎక్కువగా స్టార్లకే సపోర్ట్ చేస్తారు' అంటున్నారు ఎనలిస్టులు. 'కొత్త నటుల సినిమాలకు థియేటర్ల సమస్య ఎక్కువగా ఉంటోంది. లీజుల వ్యవస్థ భరించడం కష్టంగా ఉంది. చాలా సినిమాలు రిలీజ్ కి ముందే రిజల్ట్ తేలిపోయే పరిస్థితి'అని మరో నిర్మాత చెబుతున్నారు.

కానీ పెళ్లి చూపులు నిర్మాత రాజ్ కందుకూరి మాత్రం 'నా తర్వాతి సినిమా మెంటల్ మదిలో చిత్రానికి కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఖాయం. కంటెంట్ బాగుంటే తెలుగు ఆడియన్స్ కచ్చితంగా ఆదరిస్తారు' అంటున్నారు. ఎవరి వెర్షన్ వారికి కరెక్టే కానీ.. సినిమా ఆడకపోతే.. అది జనాల తప్పు అనడం కరెక్ట్ కాదేమో!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/