Begin typing your search above and press return to search.

విక్రమ్ కు కొత్త టెన్షన్

By:  Tupaki Desk   |   20 Jun 2019 11:57 AM GMT
విక్రమ్ కు కొత్త టెన్షన్
X
రేపు దేశవ్యాప్తంగా భారీ ఎత్తున కబీర్ సింగ్ విడుదల కానుంది. సల్మాన్ ఖాన్ భారత్ వచ్చి రెండు వారాలు అవుతోంది. దాదాపు అన్ని చోట్ల స్లో అయిపోయింది. మెట్రోస్ తప్ప దేశవ్యాప్తంగా కలెక్షన్స్ లో విపరీతమైన డ్రాప్ ఉంది. సో బెస్ట్ ఆప్షన్ గా కబీర్ సింగ్ వైపే చూస్తున్నారు ప్రేక్షకులు. అర్జున్ రెడ్డి రీమేక్ గా వస్తున్నప్పటికీ దీనికి తెలుగు రాష్ట్రాల ముఖ్య కేంద్రాల్లో బాగానే స్క్రీన్లు వేయడం విశేషం. ఇప్పుడు దీనికి విక్రమ్ కు కనెక్షన్ ఏంటి అనేదేగా మీ డౌట్. అక్కడికే వద్దాం.

అతని వారసుడు ధృవ్ మొదటి సినిమా ఆదిత్య వర్మ కూడా దీని రీమేకే అన్న సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ రెడీ అవుతోంది. ఈ మధ్యే టీజర్ వదిలారు. రేపు కబీర్ సింగ్ కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తే కనక అప్పుడు ధృవ్ ఒక్క విజయ్ దేవరకొండను మరిపిస్తే సరిపోదు షాహిద్ కపూర్ ని కూడా టార్గెట్ చేయాలి ఇది అంత ఈజీ కాదు.

అర్జున్ రెడ్డి చేసే సమయానికి విజయ్ దేవరకొండకు కొన్ని సినిమాలు చేసిన అనుభవం ఉంది. షాహిద్ కపూర్ వచ్చి దశాబ్దం ఎప్పుడో దాటేసింది. వీళ్ళిద్దరితో డెబ్యూ మూవీ చేస్తున్న ధృవ్ కి పోలిక పెట్టడం సబబు కాదు కానీ సోషల్ మీడియాలో నెటిజెన్లకు అలాంటి జాలి దయ ఏమి ఉండవుగా. ఏ మాత్రం సందు దొరికినా ట్రాలింగ్ కు పని చెప్తారు.

సో ఆదిత్య వర్మ ఇప్పుడు అర్జున్ రెడ్డితో పాటు కబీర్ సింగ్ ని మరిపించేలా అవుట్ ఫుట్ రావాల్సి ఉంటుంది. ఇప్పటికే తమిళనాడులోనూ కబీర్ సింగ్ భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడే అందరూ చూసేస్తే రేపు ఆదిత్య వర్మపై కామెంట్స్ ఎక్కువ వచ్చే పరిస్థితి. చూస్తూ ఉండి పాజిటివ్ గా ఆలోచించడం తప్ప విక్రమ్ మాత్రం చేయగలిగింది ఇప్పుడు ఏమి లేదు