Begin typing your search above and press return to search.

​బిగ్ బాస్ లోకి కొత్త సెలబ్రిటీస్??

By:  Tupaki Desk   |   20 July 2017 6:26 AM GMT
​బిగ్ బాస్ లోకి కొత్త సెలబ్రిటీస్??
X
ఇండియన్ టి‌వి చరిత్రలోనే అతి పెద్ద రియాలిటీ షో గా బిగ్ బాస్ కి మంచి పేరు ఉంది. బిగ్ బాస్ షో హిందీలో పెద్ద విజయం పొందింది. కాబట్టి బిగ్ బాస్ షో మేనేజ్మెంట్ మిగతా ప్రాంతీయ భాషలలోకుడా ఇదే షోని నిర్మించాలి అని సంకల్పించారు. అయితే ఈ షో నిర్మించడానికి గేమ్ షోలో పాల్గొనే వాళ్ళ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు అనే చెప్పాలి. మొత్తానికి షోని హోస్ట్ చేయడానికి అయితే తెలుగులో అదిరిపోయే హోస్ట్ ని పట్టేశారు. ఈ షో కూడా బాగానే ప్రచారం చేసి మొదలుపెట్టారు. బిగ్ బాస్ మొదలై మూడు రోజులు గడుస్తున్న షో అంత కిక్ ఇవ్వటం లేదు అని వీక్షకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే బిగ్ బాస్ గేమ్ షో రూల్స్ బట్టి వైల్డ్ కార్డ్ అనే ఆప్షన్ ద్వారా ఎవరినైనా ఒకరిని లోపలికి తీసుకురావచ్చు. రోజు గంట సేపు ఆ షో ని చూడలేకపోతున్నాము అని కొందరు విసుకుంటున్నారు అని తెలుస్తుంది. అయితే ఈ షో లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆప్షన్ వాడి ఎవరైనా హీరోయిన్ కానీ లేదా ఫేమస్ టి‌వి స్టార్ ని గాని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారట బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్ళు. అసలు బిగ్ బాస్ వాళ్ళకి ఇప్పుడు ఉన్న 14 మంది దొరకడమే అతి కష్టం మీద దొరికారు. ఇప్పుడు కొత్త జోష్ కోసం కొత్త అందాలను వెతుకుతున్నారు.

ఇప్పుడు ఈ వైల్డ్ కార్డ్ లో ఉన్నవారి లిస్ట్ కూడా చాలా పెద్దదే అని చెప్పాలి. ఇదే లిస్ట్ లో మంచు లక్ష్మి - తేజస్వి మదివాడ కూడా ఉన్నారు. అయితే మంచు లక్ష్మి చేయదు అనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇక తేజస్వి సంగతి తెలియదు కాని.. యాంకర్ బిగ్ బాస్ వాళ్ళు మాత్రం స్టార్ యాంకర్ ఎవరైనా అయితే బాగుంటుంది అని సూచనలు ఇస్తునట్లు తెలుస్తుంది. అనసూయ అండ్ రష్మి పేర్లు వినిపిస్తున్నాయి. కాని బాగ పాపులర్ అయి ఉండి బిజీ గా ఉన్న వాళ్ళు 70 రోజులు ఇలా ఒకే ఇంటిలో ఉండటానికి ఇబ్బందనే చెప్పారని తెలుస్తోంది. అలాగే క్యారక్టర్ ఆర్టిస్ట్ పోసాని కృష్ణమురళిని కూడా వీళ్ళు లోపలకు తేవాలని ప్రయత్నిస్తున్నారు కాని.. ఆయన ఈ మధ్యన ఈ షో చేయబోనని చెప్పిన సంగతి తెలిసిందే. ఇంకో మ్యాటర్ ఏంటంటే.. ఈ కార్యక్రమంలో మేకప్ లేకుండా కనిపించాలంటే కష్టంగానే ఉంది.