సస్పెన్స్: నందమూరి కొత్త హీరో

Sun Jul 22 2018 14:08:12 GMT+0530 (IST)

మెగా కాంపౌండ్ లో డజను హీరోలున్నారు. ఏకంగా ఓ క్రికెట్ టీమ్ అంతమంది ఇండస్ట్రీని ఏలేస్తున్నారంటూ ప్రచారం ఉంది. ఇకపోతే అక్కినేని కాంపౌండ్ లో ముగ్గురు హీరోలు లీడ్‌లో ఉండగా ఇద్దరు లీడ్ లోకి వచ్చేందుకు ట్రై చేస్తున్నారు. దగ్గుబాటి కాంపౌండ్ లో ఇద్దరే ఇద్దరు హీరోలు వార్ లో ఉన్నారు. మంచు కాంపౌండ్ లో ముగ్గురు హీరోలు - ఒక హీరోయిన్ ఉన్నారు. అయితే నందమూరి కాంపౌండ్ లో ఎందరు ఉన్నారు? అంటే టకీమని సమాధానం చెప్పలేం.ఇప్పటికిప్పుడు నందమూరి కాంపౌండ్ హీరోల్ని లెక్కిస్తే నటసింహా నందమూరి బాలకృష్ణ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ పేర్లు గుర్తుకొస్తాయి. తారకరత్న ప్రస్తుతం లీడ్ లో లేరు. త్వరలో కొత్త మేకోవర్ కోసం ప్రయత్నిస్తున్నాడన్న సమాచారం ఉంది. తర్వాత మోక్షజ్ఞ బరిలో దిగుతున్నాడన్న ప్రచారం ఉంది. నారా రోహిత్ బాలయ్యబాబుకు చుట్టమే అయినా నారా కాంపౌండ్ కింద లెక్క. ఇక జానకిరామ్ వారసుడు బరిలో ఉన్నాడని చెబుతున్నా పూర్తి స్థాయిలో ఎలివేట్ కాలేదింకా. అయితే వీళ్లతో పాటు మరి కొన్నేళ్లలోనే ఓ కొత్త హీరో బరిలో దిగుతాడన్నది ఊహించని సస్పెన్స్. ఇంతకీ ఎవరా కొత్త హీరో? అంటే ఇడిగో ఇక్కడ కనిపిస్తున్నాడే ఈ బుడతడే. చూడగానే మెరుపువీరుడి చూపులతో తీరుగా కట్టిపడేస్తున్నాడు. చబ్బీగా కనిపిస్తున్నా.. అభయ్ రామ్ అన్న పేరుకు తగ్గట్టే అతడిలో వాడి వేడి కనిపిస్తోంది. బరిలో దిగితే బంతాటే అన్న సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. అయితే అభయ్ ని తొలుత బాలనటుడిగా పరిచయం చేసి అటుపై ఎదిగే క్రమంలో హీరోని చేస్తారా? అన్నది కాస్త వేచి చూడాలి. నేడు అభయ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా తుపాకి తరపున శుభాకాంక్షలు.