Begin typing your search above and press return to search.

చరణ్ ఫ్యామిలీలో కొత్త మెంబర్

By:  Tupaki Desk   |   26 April 2017 8:15 AM GMT
చరణ్ ఫ్యామిలీలో కొత్త మెంబర్
X
మెగా పవర్ స్టార్ ఫ్యామిలీలో కొత్త మెంబర్ అనగానే రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి. జూనియర్ రామ్ చరణ్ వచ్చేస్తున్నాడా అనిపించక మానదు. అయితే.. ఈ మెంబర్ సంగతి వేరు. చెర్రీకి గుర్రాలంటే ఎంత ప్రాణమో తెలిసిన విషయమే. వాటిని తన కుటుంబ సభ్యులుగా చూసుకుంటాడు రామ్ చరణ్.

ఇప్పుడు చెర్రీ ఫ్యామిలీలోకి ఓ కొత్త మెంబర్ వచ్చి చేరింది. ఈ విషయాన్ని స్వయంగా ఉపాసనే చెప్పింది. ఓ బుల్లి గుర్రం పిల్ల బొమ్మను ఫోటో తీసి నెట్ లో పెట్టిన ఉపాసన.. తమ కొత్త ఫ్యామిలీ మెంబర్ గురించి చెప్పింది. 'మా కుటుంబంలోకి వచ్చిన కొత్త మెంబర్ చేరింది. ఎంతో అందంగా ఉన్న ఈ ఆరోగ్యమైన పిల్ల తెగ నచ్చేసింది. ఈ ఫోటో తీసినపుడు తన వయసు 3 గంటలు మాత్రమే' అని చెప్పింది ఉపాసన. ఈ బుల్లి గుర్రం పక్కనే ఉన్న రామ్ చరణ్.. దానికి సపర్యలు చేస్తూ తెగ ముద్దులాడేస్తున్నాడు.

ఇక చెర్రీ మూవీ విషయానికి వస్తే.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి గోదారి జిల్లాల్లో తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేశారు. ఈ షెడ్యూల్ చివరలో రామ్ చరణ్ తో పాటు ఉపాసన కూడా.. షూటింగ్ స్పాట్ కు రావడమే కాదు.. ఇద్దరూ కలిసి పలుగ్రామాలను.. పుణ్యక్షేత్రాలను సందర్శించుకున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/