పాయల్ అంత సాహసం చేయబోతుందా?

Tue Dec 18 2018 18:00:27 GMT+0530 (IST)

సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఆర్‌ఎక్స్ 100 చిత్రం తో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పూత్ కు ఆ తర్వాత పలు చిత్రాల్లో ఆఫర్లు వచ్చాయి. కాని అన్ని బోల్డ్ పాత్రలు అవ్వడంతో పాటు అందాల ప్రదర్శణకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ తనను వారి సినిమాల్లో ఎంపిక చేయాలనుకోవడంతో పాయల్ ఆ ఆఫర్లకు నో చెప్పింది. అయితే పాయల్ రాజ్ పూత్ తాజా గా రవితేజ మూవీ కి ఓకే చెపింది. ఆ చిత్రంలో హీరోయిన్ పాత్రకు స్కోప్ ఎక్కువగా ఉండటంతో పాటు నటనకు ఆస్కారం ఉంటుందట.రవితేజ హీరో గా విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఒక హీరోయిన్ గా పాయల్ దాదాపుగా ఖరారు అయ్యింది. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర అప్ డేట్ ఒక సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. పాయల్ కళ్లు లేని అమ్మాయిగా చెవులు వినిపించని అమ్మాయిగా నటించబోతుందట. సహజంగా ఏ కమర్షియల్ హీరోయిన్స్ కూడా ఇలాంటి సాహసవంతమైన పాత్రలకు ఓకే చెప్పరు. కాని పాయల్ మాత్రం ఈ పాత్రపై చాలా ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

కేవలం ఒక్క సినిమాతోనే మంచి గుర్తింపును దక్కించుకున్న పాయల్ రాజ్ పూత్ రెండవ సినిమాతో ఇంత పెద్ద సాహసవంతమైన పాత్రను చేయేడం నిజంగా అభినందనీయంగా చెప్పుకోవాలి. ఆ సినిమా కాస్త అటు ఇటు అయినా పాత్ర అంతగా ఆకట్టుకోక పోయినా కూడా ఆమె కెరీర్ ప్రమాదంలో పడుతుందని తెలిసి కూడా పాయల్ ఈ పాత్రకు ఒప్పుకోవడం నిజంగా గ్రేట్ విషయంగా చెప్పుకోవాలి. పాయల్ చేస్తున్న ఈ అతి పెద్ద సాహసం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.