Begin typing your search above and press return to search.

యుఎస్ మార్కెట్ లో కొత్త రక్తం

By:  Tupaki Desk   |   27 Jun 2019 2:30 PM GMT
యుఎస్ మార్కెట్ లో కొత్త రక్తం
X
ఓ పదిహేనేళ్లు వెనక్కు వెళ్తే ఓ తెలుగు సినిమా డివిడి అమెరికాలో రిలీజ్ అయితే అదే గొప్ప అనుకునేవాళ్లు. అక్కడి మన ప్రేక్షకులు సైతం ఆలస్యంగా అయినా ఆ రూపంలోనే సినిమాలు చూసి ఆనందించే వాళ్ళు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మార్కెట్ విస్తృతంగా పెరిగిపోయి ఇండియా కంటే ముందుగా అమెరికాలోనే ప్రీమియర్ షోలు వేసే స్థాయికి చేరుకుంది. ఎంతగా అంటే ఖాన్ల బాలీవుడ్ సినిమాలను సైతం తలదన్నేలా. కంటెంట్ ఉంటే చాలు రెండు లేదా మూడు మిలియన్ డాలర్లు సులభంగా వచ్చేస్తున్నాయి.

తొలినాళ్ళలో దీని మీద పెట్టుబడులు పెట్టిన కొన్ని సంస్థలు ఇప్పుడు మోనోపోలీ పోకడలు ప్రదర్శించడం మొదలుపెట్టడంతో నిర్మాతలు కొత్త వాళ్ళను ప్రోత్సహిస్తున్నారు. రాను రాను డిమాండ్లు ఎక్కువ కావడం చెప్పిన తాము చెప్పిన ధరకే సినిమా అమ్మాలానే ధోరణి చూపించడం వెరసి కొత్తవాళ్ళను ఈ రంగంలోకి వచ్చేలా చేస్తున్నాయి. ఈ కారణంగానే వచ్చే నెలలో విడుదల కాబోతున్న ఓ క్రేజీ యూత్ హీరో సినిమాను సదరు నిర్మాతలు మంచి రేట్ కి కొత్త వాళ్ళకు అమ్మారట.

ప్రమోషన్స్ వినూత్నంగా చేయడంతో పాటు ఆడియన్స్ ఎక్కువ వచ్చేలా చేస్తున్న పబ్లిసిటీ ఆకట్టుకోవడంతో వీళ్ళకు అవకాశాలు దక్కుతున్నాయని తెలిసింది. సీనియర్ డిస్ట్రిబ్యూటర్లు కదా అని ఆఫర్ ఇస్తే ప్రమోషన్ ని నిర్లక్ష్యం చేసి ఇక్కడ హిట్ అయిన సినిమాను అక్కడ ఫ్లాప్ గా మారుస్తున్నారని ఓ నిర్మాత మీడియా ముందే వాపోయారు. ఇప్పుడు కొత్తవాళ్ళను ప్రోత్సహించడం వల్ల పోటీ తత్వం పెరిగి నిర్మాతలకు లాభం చేకూరడం ఖాయం. రానున్న సీజన్ లో భారీ క్రేజీ మూవీస్ క్యు కట్టడంతో ఓవర్సీస్ మార్కెట్ చాలా కీలకంగా మారనుంది