Begin typing your search above and press return to search.

తిట్టి పోసేంత త‌ప్పు స‌న్నీలియాన్‌ చేసిందా?

By:  Tupaki Desk   |   23 July 2017 6:35 AM GMT
తిట్టి పోసేంత త‌ప్పు స‌న్నీలియాన్‌ చేసిందా?
X
స‌న్నీ లియాన్ పేరే ఓ సంచ‌ల‌నం. వ్య‌క్తిగ‌తంగా ఆమెలో వేలెత్తి చూపించే ప‌ని ఏదైనా ఉండ‌టం అంటే.. అది ఆమె గ‌తంలో న‌టించిన పోర్న్ సినిమాలే. అయితే.. ఆ విష‌యంలోనూ ఆమెను నిందించ‌లేం. ఎందుకంటే.. చ‌ట్ట‌బ‌ద్ధంగా పోర్న్ సినిమాల‌కు అనుమ‌తి ఉన్న చోట ఆమె న‌టించింది. ఆ విష‌యాన్ని ఒప్పుకుందే త‌ప్పించి.. స‌మ‌ర్థించుకోవ‌టం.. గొప్ప‌గా చెప్పుకోవ‌టం లాంటివి చేయ‌లేదు. త‌న‌కు ల‌భించిన ఒక అవకాశంతో పోర్న్ లో నుంచి బ‌య‌ట‌ప‌డింది కూడా.

అయితే.. సన్నీలోని పోర్న్ గ‌తాన్ని గుర్తు చేస్తూ.. మీడియాలో వ‌చ్చే వార్త‌లు మిన‌హా.. స‌న్నీ చేసిన త‌ప్పు ప‌నంటూ ఏమీ లేద‌నే చెప్పాలి. అయితే.. ఏ ప‌ని చేసినా స‌న్నీని తిట్ట‌టం.. త‌ప్పు ప‌ట్ట‌టం కొంద‌రికి అల‌వాటు.

ఇప్పుడు అలాంటిదే మ‌రొక‌టి చోటు చేసుకుంది. పిల్ల‌ల్లేని స‌న్నీ లియోని.. 21 నెల‌ల చిన్నారిని ద‌త్త‌త తీసుకుంది. ఈ విష‌యం స‌న్నీ గుట్టుగా ఉంచిన‌ప్ప‌టికీ మోడ‌ల్ క‌మ్ న‌టి షెర్లీన్ చోప్రా పుణ్య‌మా అని ద‌త్త‌త వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

దీంతో.. స‌న్నీని అంద‌రూ బాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు సెల‌బ్రిటీలు అభినందిస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు మాత్రం సెల‌బ్రిటీల‌కు భిన్నంగా రియాక్ట్ కావ‌టం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

స‌న్నీ లాంటి పోర్న్ స్టార్ ఒక చిన్నారిని ద‌త్త‌త తీసుకుంటే ప్ర‌భుత్వం ఎలా ఒప్పుకుంది? చిన్నారిని కూడా పోర్న్ స్టార్ గా మారుస్తుందా? అంటూ నోటికి వ‌చ్చిన‌ట్లుగా తిట్టి పోస్తున్నారు. స‌న్నీ గ‌తంలో పోర్న్ స్టార్ అన్న‌ది నిజం. కానీ.. ఇప్పుడు మాత్రం కాదు. ఒక వ్య‌క్తి స‌మాజం ఏ మాత్రం ఒప్పుకోలేని వృత్తిని స్వీక‌రించి.. ఆ త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌స్తే.. మిగిలిన వారి మాదిరి బ‌త‌క‌కూడ‌దా? స‌న్నీ నిజంగానే త‌ప్పు చేసిందా? అంటే లేద‌నే చెప్పాలి. ఒక చిన్నారికి చ‌క్క‌టి జీవితాన్ని ఇచ్చిన దానికి మురిసిపోకుండా.. ఇలా తిట్టిపోయటాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.

ఒక మ‌హిళ‌కు త‌న గ‌తాన్ని అదే ప‌నిగా గుర్తు చేసి త‌ప్పు ప‌ట్ట‌టం.. బాధ‌కు గురి చేయ‌టం మంచిదేనా? అన్న‌ది ప్ర‌శ్నించుకోవాల్సి ఉంది. తుడిచి వేయ‌లేని గ‌తాన్ని అదే ప‌నిగా కెల‌క‌టం కంటే.. వ‌ర్త‌మానంలోని ఆమెను ఆమెగా గుర్తించి.. గౌర‌వించ‌టం స‌బ‌బు అని చెప్ప‌టంలో సందేహం లేదు. స‌న్నీని సూటిపోటి మాట‌లు అనటం స‌రికాద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. సోష‌ల్ మీడియాలో త‌న‌ను తిట్టి పోస్తున్న వారిపై ఎలాంటి రియాక్ష‌న్ ప్ర‌ద‌ర్శించ‌కుండా ఎప్ప‌టిలానే త‌న మానాన తాను అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తోంది సన్నీ. ఆమె మార్గంలోనే ఆమెను త‌ప్పు ప‌ట్టే వారు న‌డిస్తే బాగుంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.