Begin typing your search above and press return to search.

రానా షోలో డబుల్ మీనింగ్ డైలాగులా

By:  Tupaki Desk   |   17 Aug 2017 10:10 AM GMT
రానా షోలో డబుల్ మీనింగ్ డైలాగులా
X
ప్రస్తుత రోజుల్లో టీవీల్లో వస్తున్న రియాలిటీ షోల్లో మితిమీరిన సంభాషణలు చాలా ఎక్కువయిపోతున్నాయి. ముఖ్యంగా సెలబ్రెటీలు చేసే కొన్ని సంభాషణలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నా రానా నెంబర్ వన్ యారి షోలో కూడా ఇదే తరహాలో కొన్ని అబ్యంతరకర వ్యాఖ్యలు వాడినట్లు సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

అసలు మ్యాటర్ లోకి వెళితే.. రానా వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న నెంబర్ వన్ యారి రానా షోలో మంచు లక్మి ప్రసన్న - తాప్సి గెస్ట్ లుగా వచ్చారట. అయితే ఆ ఎపిసోడ్ కి సంనదించిన ఓ ప్రోమోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు షో నిర్వాహకులు. అయితే అందులో తాప్సి ఏమందంటే.. రానా ను ప్రపోస్ చేయాలనుకుంటున్నాను లక్ష్మి ఎందుకంటే.. అతని 'పెద్ద' కండలు మరియి అతని 'పెద్ద' హార్ట్ చూసి పడిపోయా అని చెప్పలోపే.. మంచు లక్ష్మి.. నాకు రానా విషయంలో ఏది పెద్దగా ఉందొ తెలుసుకోవలిసిన అవసరం లేదని చెప్పడంతో అక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్ కి రానా కూడా పడి పడి నవ్వేశాడు.

దీంతో అది చుసిన నెటిజన్లు కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. మంచిగా నడుస్తున్న ఈ తరహా షోలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని అంటున్నారు. అయితే ఆ షోను టేలిక్యాస్ట్ చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు అంటున్నారు కొందరు. చూడాలి మరి ఇంకా ఎన్ని డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నాయో..