Begin typing your search above and press return to search.

రాజమౌళి రివ్యూ పై నెగిటివ్ కామెంట్స్

By:  Tupaki Desk   |   21 Sep 2017 1:22 PM GMT
రాజమౌళి రివ్యూ పై నెగిటివ్ కామెంట్స్
X
అపజయం ఎరుగని దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే ప్రస్తుత రోజుల్లో రాజమౌళి అనే చెబుతారు. ప్రతి దర్శకుడికి ఎక్కడో ఒక చోట అపజయం వస్తుంది. కానీ జక్కన్న తెరకెక్కించిన ఒక్క సినిమా కూడా ఇంతవరకు అపజయం చెందలేదు. ఆయన దర్శకత్వం చేసిన చిత్రాల నిర్మాతలకు కలెక్షన్స్ రాగా హీరోలకు స్టార్ హోదా దక్కింది. అలాంటి వ్యక్తి ఓ జడ్జిమెంట్ ఇచ్చాడంటే ఎవ్వరైనా డౌట్ లేకుండా ఏకీభవిస్తారు. కానీ రాజమౌళి గత కొంత కాలంగా ఇతర చిత్రాలపై ఇస్తున్న కామెంట్స్ కి నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే ఆయన సపోర్ట్ చేసిన చిత్రాలన్నీ డిజాస్టర్స్ అయినవే.

మొన్న యుద్ధం శరణం సినిమాకు రాజమౌళి చాలా పాజిటివ్ కామెంట్స్ చేశాడు. దీంతో ఆ ప్రభావం ఎంతో కొంత ఓ వర్గం ప్రేక్షకులపై పడే ఉంటుంది. చివరికి సినిమా చుసిన తర్వాత జక్కన్న మాటలు ఇంకోసారి నమ్మకూడదు.. అందరిలానే ఆయన కూడా బాలేకపోయినా పొగుడుతున్నారని అర్థమైందని నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇక పటేల్ సర్ కి అలాగే పైసా వసూల్ కి రాజమౌళి ఇచ్చిన రివ్యూ అంతగా ఎవరు నచ్చలేదు. అదే తరహాలో ఇప్పుడు జై లవకుశ సినిమాపై చేసిన కామెంట్స్ కి చాలా వరకు నెటిజన్స్ కౌంటర్లు వేస్తున్నారు.

అసలు రాజమౌళి సినిమా గురించి చెప్పకపోవడం మైనెస్ అయ్యింది. ఎందుకంటే 'తారక్‌.. నా గుండె గర్వంతో ఉప్పొంగుతోంది. మాటలు రావడం లేదు అంటూ.. జై.. జై.. జైలవకుశ' అని ట్వీట్‌ చేశారు. ఈ కామెంట్ లో జక్కన్న ఎక్కడా కూడా సినిమా కథ గురించి గాని పాత్రల గురించి గాని ప్రస్తావించలేదు. కేవలం తారక్ పై ఉన్న ప్రేమను మాత్రమే చూపించాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు మాత్రం సంబరం చేసుకుంటున్నా.. మామూలు సినిమా లవ్వర్స్ మాత్రం జక్కన్న ఇలా అసంపూర్ణమైన రివ్యూలు ఇవ్వడం బాగాలేదని అంటున్నారు.