చెర్రీ కామెంట్స్.. 'అల్లు'ళ్ళపై పంచులు

Sun Jul 16 2017 10:32:33 GMT+0530 (IST)

ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో రంగస్థలం 1985 చిత్రాన్ని చేస్తున్న మెగా పవర్ స్టార్.. డైరెక్టర్ సుకుమార్ నిర్మాణంలో రూపొందుతున్న దర్శకుడు ప్రమోషన్స్ కోసం ఆడియో లాంఛ్ కార్యక్రమానికి అటెండ్ అయ్యాడు. ఆ సందర్భంలో ఆడిటోరియంలో పవర్ స్టార్ ను ఉద్దేశించి చెప్పాలంటూ.. బాబాయ్ అనే అరుపులు వినిపించాయి. 'బాబాయ్.. బాబాయ్. మనకు నచ్చిన వ్యక్తులు గురించి రోజూ మాట్లాడుకోం.. అమ్మ గురించి రోజూ మాట్లాడుకోం.. నచ్చిన వ్యక్తులు మన మనసులో ఉండాలి.. మాటల్లో కాదు.. నా ఫ్యామిలీ నా మనసులో ఎక్కువగా ఉంటుంది.. నా మాటల్లో తక్కువగా ఉంటుంది. అర్ధం చేసుకోండి'  అని అభిమానులను సముదాయించాడు. ఇప్పుడు ఈ కామెంట్లే 'అల్లు'వారి పాలిట తూటాలు అయిపోయాయ్.

మొన్న వరుణ్ తేజ్.. బాబాయ్ గురించి టాపిక్ వచ్చినప్పుడు.. మెగాస్టార్ అండ్ పవర్ స్టార్ లేకపోతే నేను లేను అంటూ ఒక్క మాట చెప్పేశాడు. అలాగే అప్పట్లో సాయిధరమ్ తేజ్ కూడా 'చెబుతాను బ్రదర్' అంటూ పవన్ ఫ్యాన్స్ ను కూల్ డౌన్ చేశాడు. నిజానికి ఆడిటోరియంలలో పవర్ స్టార్ అని ఎన్నేసి సార్లు అరుస్తున్నా కూడా.. వీరు 'ఓకె' అన్నారేతప్పించి.. పవర్ స్టార్ గురించి పేజీలకు పేజీలు ఉపన్యాసాలు ఇవ్వలేదు. గత రాత్రి చరణ్ కూడా పవన్ పేరును కాని పవర్ స్టార్ అని కాని డైరక్టుగా ఉచ్చరించలేదు. కాకపోతే వీళ్ళ లాజిక్ బాగుంది.

 అదే అల్లు అర్జున్ విషయానికి వస్తే.. డైరక్టుగా ఓపెన్ అయిపోయి.. మీరు అస్తమానం చెప్పమంటే చెప్పను బ్రదర్ అనేశాడు. అతను చెప్పింది నిజమే కావొచ్చు.. అరవొద్దని చెప్పడానికే అలా చెప్పుండొచ్చు.. కాని ఎమోషనల్ లాజిక్ మిస్సయితే ఎలా? అంటున్నారు నెటిజన్లు. అందుకే ఇప్పుడు మెగా బ్రదర్స్ దగ్గర నుండి మెగా 'అల్లు'ళ్ళు నేర్చుకోవాలంటూ ఫేస్ బుక్కులో ట్విట్టర్లో పంచులు పడుతున్నాయి. అది సంగతి.