Begin typing your search above and press return to search.

రెబెల్ స్టార్ రేంజ్ చూశారా...

By:  Tupaki Desk   |   12 Aug 2017 9:39 AM GMT
రెబెల్ స్టార్ రేంజ్ చూశారా...
X
బాహుబలి హీరోగా ప్రభాస్ పేరు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. ఈ సినిమా మన దేశంలో ఎంత ఘనవిజయం పొందిందో అలాగే విదేశాలులో కూడా విడుదలై గొప్ప విజయం సాదించింది. ఈ సినిమాతో ప్రభాస్ కు ఉన్న క్రేజ్ రెట్టింపు అయ్యింది అనే చెప్పాలి. ఇప్పుడు ప్రభాస్ చేయబోతున్న ప్రతీ సినిమా అన్నీ బాషల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని చేయవలిసి ఉంది. బాహుబలి సినిమాతో కొన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్లు ప్రభాస్ ని ప్రచారకర్తగా తీసుకున్నాయి. ఇప్పుడు అలాగే తన తాజా సినిమా ఆన్ లైన్ ప్రసారంకు సంబందించిన రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తం పెట్టి కొనుక్కోంది.

యువి క్రియేషన్స్ వాళ్ళు నిర్మిస్తున్న ‘సాహో’ సినిమాను నెట్ ఫ్లిక్స్ సుమారుగా 50 కోట్లు పెట్టి రైట్స్ దక్కించుకొంది అని టాక్. ఈ సినిమాను తెలుగు - హింది - తమిళ్ - మలయాళం లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమానే కాదు ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాను కూడా రికార్డు స్థాయిలో 4 మిలియన్ యూ‌ఎస్ డాలర్లు పెట్టి కొన్నది నెట్ ఫ్లిక్స్. అయితే సాహో రైట్స్ గురించి ఇంకా అధికారికంగా ప్రకటన ఇవ్వకపోయినా తొందరలో ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉంది. సుజీత్ డైరక్షన్లో వస్తున్న సాహో సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ చేసే అవకాశం ఉండవచ్చు అని చెబుతున్నారు.

150 కోట్లు వ్యయంతో నిర్మిస్తున్న సాహో సినిమా వచ్చే ఏడాది వేసవి కాలంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను ఒకే సారి అన్నీ బాషలులోనూ విడుదల చేస్తున్నారు. సాహో షూటింగ్ జరుగుతున్నా ఇంకా హీరోయిన్ ఎవరు అనేది ఒక నిర్ణయానికి రాకపోవడం ప్రభాస్ అభిమానుల ఆందోళన పడుతున్నారు. ఈ సినిమా నేషనల్ లెవెల్లో విడుదలకాబోతుంది కాబట్టి బాలీవుడ్ హీరోయిన్ కోసం చూస్తున్నట్లు తెలుస్తుంది.