Begin typing your search above and press return to search.

తేజ్ కొత్త ట్రెండ్‌ ను షురూ చేశాడుగా..!

By:  Tupaki Desk   |   24 March 2017 7:18 AM GMT
తేజ్ కొత్త ట్రెండ్‌ ను షురూ చేశాడుగా..!
X
రోజులు మారిపోతున్నాయ్‌. కాలానికి త‌గ్గ‌ట్లుగా మారిపోవాలి. ఇమేజ్ అంటూ చ‌ట్రంలోకి చిక్కుకుపోవ‌టానికి మించిన పెద్ద త‌ప్పు మ‌రొక‌టి ఉండ‌దు. అదేం చిత్ర‌మో కానీ.. ఈ ఇమేజ్ అన్న మాట టాలీవుడ్‌లో అదే ప‌నిగా వినిపిస్తుంటుంది కానీ.. బాలీవుడ్ హీరోలు ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోరు. అవ‌స‌రం అనిపిస్తే చాలు.. ఏదైనా చేసేందుకు ఓకే అనేస్తారు. అందుకే.. బాలీవుడ్‌ లో వ‌చ్చిన‌న్ని కాంబినేష‌న్లు టాలీవుడ్‌ లో రావు. వ‌చ్చిన ఒక‌ట్రెండింటికి ఎంత‌గా ప్ర‌చారం సాగుతుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా సినిమాలు చేసుకుంటూ.. యూత్ హీరోగా త‌న‌దైన ముద్ర‌ను వేశాడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌. మెగా క్యాంప్ నుంచి వ‌చ్చిన ఈ చ‌లాకీ కుర్రాడు తాజాగా ఒక కొత్త ట్రెండ్‌ కు శ్రీకారం చుట్టార‌నే చెప్పాలి. యూట్యూబ్ పుణ్య‌మా అని షార్ట్ ఫిలింస్‌.. వెబ్ సీరిస్ లో సంద‌డి రోజురోజుకి పెరుగుతోంది. కొన్ని షార్ట్ ఫిలింస్ అయితే.. సినిమాల్లో క‌నిపించే క్వాలిటీని మొయింటైన్ చేస్తున‌న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. తాజాగా ప‌లు వెబ్ సీరిస్ లు బాగా పాపుల‌ర్ అవుతున్నాయి. ప‌రిమిత బ‌డ్జెట్‌ లో ప్ర‌యోగాలు చేస్తూ.. కొత్త త‌ర‌హా వినోదాన్ని అందిస్తున్నారు.

ఇలా వ‌చ్చిన కొన్ని షార్ట్ ఫిలింస్ చ‌క్క‌టి ఆద‌ర‌ణ పొందాయి. అద్వైతం.. ముద్ద‌ప‌ప్పు అవ‌కాయ లాంటివి ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్పాలి. తాజాగా వ‌చ్చిన ఒక వెబ్ సీరిస్ ట్రైల‌ర్ చూస్తే.. సినిమా స్థాయికి ఏ మాత్రం త‌గ్గ‌ని రీతిలో ఉండ‌టం గ‌మ‌నార్హం.

నేను మీ క‌ళ్యాణ్ పేరుతో వ‌స్తున్న ఈ వెబ్ సిరీస్ లో న‌టించిన హీరో మ‌రెవ‌రూ కాదు.. మ‌న‌సంతా.. కేరింత సినిమాల్లో న‌టించిన విశ్వాంత్‌. ఞ‌క కుర్రాడి స్వీట్ ల‌వ్ స్టోరీని చూపిస్తున్న ఈ వెబ్ సిరీస్ రెండు నిమిషాలకు పైనే నిడివి ఉంది. చాలా ఫ‌న్నీగా ఉన్న ఈ ట్రైల‌ర్‌లో మ‌రో విశేషం ఏమిటంటే.. సాయిధ‌ర‌మ్ తేజ్ క‌నిపించ‌టం. అస‌లు విష‌యం ఏమిటంటే.. వెబ్ సిరీస్‌ లో అతిధి పాత్ర‌లో న‌టించాల‌న్న రిక్వెస్ట్‌ ను తేజ్ ఓకే చెప్పేసిన వైనం చూస్తే.. టాలీవుడ్ హీరోల్లో కొత్త ట్రెండ్ ను షురూ చేశార‌నిపించ‌క మాన‌దు. ఒక పేరున్న న‌టుడు ఇలా వెబ్ సిరీస్‌లో న‌టించ‌టం ఆస‌క్తిక‌ర‌మైన అంశంగా చెప్పాలి. ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే.. స్టార్టింగ్‌ లోనూ.. ఎండింగ్‌ లోనూ తేజ్ అల‌రిస్తాడు. తేజ్ బాట‌లో మ‌రికొంద‌రు హీరోలు న‌డిస్తే.. మ‌రిన్ని ఆస‌క్తిక‌ర అంశాలు తెర మీద‌కు వ‌చ్చే అవకాశం ఉంద‌ని చెప్పొచ్చు.






Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/