Begin typing your search above and press return to search.

నాని మూవీకి 58 కోట్ల గ్రాస్

By:  Tupaki Desk   |   24 March 2017 8:21 AM GMT
నాని మూవీకి 58 కోట్ల గ్రాస్
X
నాని నటించిన లేటెస్ట్ మూవీ నేను లోకల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫుల్ రన్ కలెక్షన్స్ చూస్తే.. నానిని నేచురల్ స్టార్ అని ఎందుకు పిలవాలో అర్ధమవుతుంది. ఫిబ్రవరి తొలివారంలో రిలీజ్ అయిన ఈ చిత్రం.. గత వారంలో కూడా కొన్ని థియేటర్లలో సందడి చేయగా.. ఇప్పుడీ చిత్రం తన టోటల్ రన్ పూర్తి చేసుకుంది.

నేను లోకల్ మూవీ నైజాం ఏరియాలో 10.70 కోట్ల గ్రాస్ రాబట్టి.. అందరినీ ఆశ్చర్యపరిచేసింది. వైజాగ్ 4 కోట్లు.. ఈస్ట్ 2.50 కోట్లు.. వెస్ట్ 1.55 కోట్లు.. కృష్ణా 2 కోట్లు.. గుంటూరు 2.25 కోట్లు.. నెల్లూరు 90 లక్షలు రాగా.. మొత్తం ఆంధ్రా ఏరియాలో 13.2 కోట్ల షేర్ వచ్చింది. సీడెడ్ నుంచి 3.90 కోట్లను నాని మూవీ రాబట్టగా.. తెలుగు రాష్ట్రాల్లోనే 27.8 కోట్ల షేర్ వసూలైంది. ఇక గ్రాస్ లెక్క అయితే 42.7 కోట్ల పైమాటే. యూఎస్ఏ లో 3.25 కోట్లు.. కర్నాటక 2.15 కోట్లు.. రెస్టాఫ్ ఏరియాలు కోటి రూపాయలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 34.2 కోట్ల షేర్ వసూలు చేయగా.. గ్రాస్ అయితే 58 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.

ఈ కలెక్షన్స్ చూస్తే.. నేను లోకల్ ఏ స్థాయి బ్లాక్ బస్టర్ అనే సంగతి తెలుస్తుంది. మిడిల్ రేంజ్ హీరోల సినిమాల్లో ఇదే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డ్ సృష్టించింది. నితిన్ నటించిన అ..ఆ.. దీనికంటే ముందున్నా.. అక్కడ త్రివిక్రమ్ బ్రాండ్ ఎక్కువగా పని చేసిందనే సంగతి మర్చిపోకూడదు. కానీ నేను..లోకల్ మాత్రం పూర్తిగా నాని పవర్ తోనే ఆడింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/