ప‌్రేమతో మొదలై...మర్డర్ తో మలుపు తిరిగి!

Sun Jul 15 2018 20:21:26 GMT+0530 (IST)

మూడు నగరాలు.. రెండు ప్రేమకథలు... ఒక సంఘటన అంటూ ఆది పినిశెట్టి ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు. ఈమధ్య కాలంలో వేరే కథానాయకుల  చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ వచ్చిన ఆది పినిశెట్టి ఈసారి హీరోగా ఓ చిత్రం చేశారు. అదే... `నీవెవరో`. తాప్సి రితికాసింగ్ ఇందులో కథానాయికలు. `నిన్ను కోరి`లాంటి ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన ఎమ్.వి.వి. సినిమా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. లవర్స్ అనే చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని అందుకొన్న హరినాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

కోన వెంకట్ ఈ చిత్రం వెనక సూత్రధారి. ఆదివారమే టీజర్ విడుదలైంది. మరో మర్డర్ మిస్టరీతో  సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమని టీజర్‌నిబట్టి అర్థమవుతోంది. ప్రేమకథతో మొదలై...  ఒక సంఘటనతో మలుపు తిరుగుతుందీ కథ. మర్డర్ మిస్టరీని ఆధారంగా చేసుకొనే ఈ చిత్రం తెరకెక్కినట్టు అర్థమవుతోంది. తాప్సి రితికాల పాత్రలు కీలకమని తెలుస్తోంది. మరి ఈచిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తుందో చూడాలి. విజువల్స్ మ్యూజిక్ ఆకట్టుకొనేలా ఉన్నాయి.