లై నాయక ను దాటిన రానా

Sat Aug 12 2017 10:47:36 GMT+0530 (IST)

శుక్రవారం ఒకే రోజున యంగ్ హీరోలు సినిమాలు విడుదల కావడంతో తెలుగు ప్రేక్షకులుకు కావలిసినంత వినోదం దొరుకుతుంది. నిన్న విడుదలైన యంగ్ హీరోల సినిమాలు అన్నీ బాగానే అలరిస్తున్నాయి అని చెబుతున్నారు. ఇక్కడ బాక్స్ ఆఫీసు కలెక్షన్లు ఎలా ఉన్న ఓవర్సీస్ లో ప్రీమియర్ కలెక్షన్లులో మాత్రం రానా దగ్గుబాటి హీరోగా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా పైచేయిలో ఉంది అని ట్రేడ్ విశ్లేషణ చెబుతుంది.

ఒకే రోజు మూడు సినిమాలు విడుదలకావడంతో అందరిలో మంచి ఆసక్తి ఏర్పడింది. ఏ సినిమా ఎలా ఉండబోతుందో ఎన్ని కోట్లు కలెక్షన్లు చేయబోతుందో అని ఇండస్ట్రి వాళ్ళంతా ఆసక్తిగా ఎదురుచూశారు. గురువారం ఓవర్సీస్ ప్రీమియర్ షోలు కలెక్షన్లు బట్టి నేనే రాజు నేనే మంత్రి మిగతా రెండు సినిమా కలెక్షన్లు తో చూస్తే రెండు అడుగులు ముందు ఉందినే తెలుస్తుంది. తేజ డైరెక్ట్ చేసిన నేనే రాజు నేనే మంత్రి సినిమా $140833 కలెక్షన్ చేసింది. అయితే స్టైలిష్ గా ఇంటెలిజెంట్ గా  కనిపించే ‘లై’ సినిమా ఊహించిన దానికన్న కొంచెం తక్కువ కలెక్షన్లతో సరిపెట్టుకుంది. లై సినిమాకు ఓవర్సీస్ ప్రీమియర్ షో లో వచ్చిన కలెక్షన్లు కేవలం $50623. ఇది ఇలా ఉండగా మరో స్టార్ డైరెక్టర్ తీసిన ‘జయ జానకి నాయక’ సినిమా కలెక్షన్లు  $8535  వచ్చాయి.

‘లై’ లాంటి కొత్త కథలకు ఓవర్సీస్ మార్కెట్ లో మంచి గిరాకీ ఉంటుంది. ఆ సినిమాకే ఓవర్సీస్ లో ఎక్కువ వస్తుంది అనుకున్నారు. కానీ రానా చేసిన ప్రచారం వలన బాహుబలి ఇంపాక్ట్ వలన ప్రీమియర్స్ కు బాగా క్రేజ్ వచ్చేసి.. నేనే రాజు నేనే మంత్రికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు మూడు సినిమాల రివ్యూలూ రేటింగులూ వచ్చేశాక.. లై సినిమాకు గణనీయంగా కలక్షన్లు పెరిగే ఛాన్సుందని.. అలాగే జయ జానకి నాయక కూడా పుంజుకుంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అది సంగతి.