Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: రవితేజ స్టైల్ లో మాస్ టికెట్టు

By:  Tupaki Desk   |   22 April 2018 4:30 AM GMT
టీజర్ టాక్: రవితేజ స్టైల్ లో మాస్ టికెట్టు
X
రవితేజ కొత్త సినిమా నేల టికెట్టు టీజర్ విడుదలైంది. హడావిడి లేకుండా తానానా తానానా అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే సాంగ్ బీట్ కి ఫ్రెండ్స్ తో కలిసి డాన్స్ చేస్తున్న రవితేజ హుషారైన స్టెప్స్ తో మొదలైన టీజర్ ఆసాంతం రవితేజ స్టైల్ లోనే కొనసాగింది. చుట్టూ జనం మధ్యలో మనం అని హీరో పాత్ర ద్వారా చెప్పించడం చూస్తుంటే వైజాగ్ తీర ప్రాంతమో లేక మరేదైనా బీచ్ ఏరియాను నేపధ్యంగా తీసుకున్నారని అర్థమైపోతోంది. మొత్తం పెద్ద సెటప్ కనిపిస్తోంది కథలో. ఏరా తినేస్తావా అంటూ హీరొయిన్ మాళవిక శర్మ అంటుండగా తనకు మాత్రమే సాధ్యమయ్యే ఎక్స్ ప్రెషన్స్ తో రవితేజ కామెడీ టైమింగ్ బాగా పేలినట్టు ఉంది. నేల టికెట్ గాళ్ళతో పెట్టుకుంటే నేల నాకించేస్తారు అంటూ చెప్పించి ఒక మంచి మసాలా ఫైట్ కూడా జోడించిన ఈ టీజర్ లో రవితేజ పాత్ర సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తరహాలో ఉంటున్నట్టు కనిపిస్తోంది.

మొత్తానికి తన ట్రేడ్ మార్క్ హీరోయిజం తో రవితేజ చేస్తున్న నేల టికెట్ టీజర్ ఫాన్స్ అంచనాలకు తగ్గట్టే ఉంది. సోగ్గాడే చిన్న నాయనా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రారండోయ్ వేడుక చూద్దాంతో మరో సూపర్ హిట్ కొట్టిన కళ్యాణ కృష్ణ దీనికి దర్శకుడు కావడం మరో ప్లస్ పాయింట్ గా నిలిచింది. లాస్ట్ ఇయర్ వచ్చిన రాజా ది గ్రేట్ తో తన రీ ఎంట్రీని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్న రవితేజ ఈ ఏడాది టచ్ చేసి చూడు చిన్న షాక్ ఇచ్చింది. నేల టికెట్ మాత్రం మళ్ళి అంచనాలు అందుకునేలా ఉంటుందని యూనిట్ మొత్తం కాన్ఫిడెంట్ గా ఉంది. శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందించిన ఈ మూవీతోనే ఎస్ ఆర్టి సంస్థ టాలీవుడ్ లో అడుగు పెడుతోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి