Begin typing your search above and press return to search.

నేల టిక్కెట్టు.. రెడీ అయ్యింది!!

By:  Tupaki Desk   |   18 May 2018 3:50 PM GMT
నేల టిక్కెట్టు.. రెడీ అయ్యింది!!
X
రాజా ది గ్రేట్ సినిమాతో ఊహించని హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయ్యాడు మాస్ రాజా రవితేజ. అయితే ఆ సినిమా తరువాత రవితేజ మళ్లీ ఊహించని ఫెయిల్యూర్ అందుకున్నాడు. టచ్ చేసి చూడు సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈ సారి కమర్షియల్ పంథా లోనే నేల టిక్కెట్టు అనే సినిమాతో రాబోతున్నాడు. సోగ్గాడే చిన్ని నయన - రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో మంచి హిట్ అందుకున్న కళ్యాణ్ కురసాల నేల టిక్కెట్టు కి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

అయితే సినిమా పనులు మొత్తం రెండు రోజుల క్రితం ఫినిష్ చేసుకున్న టిక్కెట్టు యూనిట్ సెన్సార్ పనులను కూడా ఈ రోజు ఫినిష్ చేసింది. ఏ మాత్రం కటింగ్స్ లేకుండా సినిమా U/A సర్టిఫికెట్ అందుకుంది. దీంతో కమర్షియల్ యాంగిల్ లో సినిమా ఆదరగొట్టడం ఖాయమని మాస్ రాజా అభిమానులు సినిమాపై అంచనాలు పెంచేసుకున్నారు. ఇప్పటికే ట్రైలర్ పై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇక శక్తికాంత్ కార్తిక్ అందించిన సంగీతానికి కూడా పాజిటివ్ రెస్పాన్స్ అందింది.

చిత్ర యూనిట్ కూడా సినిమాకు సంబంధించిన రిజల్ట్ పై చాలా నమ్మకంతో ఉన్నట్లు వారు ప్లాన్ చేసుకున్న ప్రమోషన్స్ బట్టి తెలుస్తోంది. మాస్ రాజా హీరోయిన్ మాళవిక నెక్స్ట్ ప్రమోషన్స్ తో బిజీ కానున్నారు. ఫైనల్ గా సినిమా నెక్స్ట్ వీక్ 25న రిలీజ్ కానుంది. దానితో పాటు కళ్యాణ్ రామ్ నా నువ్వే కూడా విడుదల కాబోతోంది. మరి ఆ రెండు సినిమాల్లో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలుస్తుందో చూడాలి.