చిరుత పిల్ల.. ఎగ్జిబిట్ తో మొదలుపెట్టిందిట

Tue Jan 10 2017 17:00:01 GMT+0530 (IST)

రామ్ చరణ్ తో కలిసి టాలీవుడ్ అరంగేట్రం చేసిన నేహాశర్మను.. టాలీవుడ్ ప్రేక్షకులు అంత తేలికగా మరిచిపోలేరు. మర్చిపోరు కూడా. తన యాక్టింగ్ తో పాటు ట్యాలెంట్ తో ఆ రేంజ్ లో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత బాలీవుడ్ కి జంప్ అయిపోయి.. కాన్సంట్రేషన్ అంతా అక్కడే పెట్టేసింది.మొదట్లో బాగానే ఉన్నా.. ఓ రెండేళ్లుగా బాలీవుడ్ లో ఈ భామ పరిస్థితి అంతగొప్పగా ఏం లేదు. క్రేజీ ప్రాజెక్టులు రావడం లేదు.. రిలీజ్ అయినవేవీ పేరు తెచ్చిపెట్టడంలేదు. దీంతో కొంచెం డైలమాలో పడిపోయిన నేహా శర్మ.. ఇప్పుడు కొత్త ఏడాదిలో తనకు మొదటి జాబ్ దొరికేసిందని అంటోంది. లైఫ్ స్టైల్ మేగజైన్ ఎగ్జిబిట్ కవర్ పేజ్ పై తన మేని మెరుపులు చూపిస్తూ ఇచ్చిన ఓ పోజ్ చూస్తుంటే.. మళ్లీ చిరుత పిల్ల గుర్తుకు రావాల్సిందే. స్లీవ్ లెస్ టాప్.. దానిపై రెడ్ కలర్ జాకెట్.. ఓ భుజం వరకూ చూపిస్తూ పోజ్.. చేతికి స్మార్ట్ వాచ్.. చెవులకు ఇయర్ ఫోన్స్.. అబ్బో.. అమ్మడు ఫుల్ ఛార్జింగ్ అయిపోయింది లెండి.

ఏళ్లు గడిచిన కొద్దీ అందంతో పాటు టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో తనకు ఎంత ట్యాలెంట్ ఉందో.. అమ్మడు సవివరంగా ఎక్స్ ప్లెయిన్ చేసింది. అలాగే టెక్నాలజీకి సంబంధించి.. ఈ అమ్మడు అందాలను కలిపి చెప్పిన కబుర్లు.. ఈ ఎగ్జిబిట్ ఎడిషన్ లో బోలెడన్ని ఉంటాయట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/